కోరికలపై నియంత్రణ

Print Friendly, PDF & Email
కోరికలపై నియంత్రణ
వివిధ రకాల సంపదలు ఉన్నాయని తెలుసుకునే నేపథ్యంలో

(ఉపాధ్యాయుడు చుక్కల వద్ద పాజ్ చేస్తూ నెమ్మదిగా వ్యాయామాన్ని చదువుతాడు. మీరు అవసరమనుకుంటే, నేపథ్యంలో మృదువైన సంగీతాన్ని పెట్టుకొనవచ్చు).

దశ 1:

సౌకర్యవంతమైన స్థితిలో కుర్చీ మీద కానీ, నేల మీద స్థిరాసనంలో కానీ కూర్చోండి. మీ వెన్నెముకను, తలను నిటారుగా ఉంచండి. మెల్లగా దీర్ఘశ్వాసను తీసుకుని, తిరిగి మెల్లగా బయటకు వదలండి. కొద్దిగా విశ్రాంతి తీసుకుని, దీర్ఘశ్వాసను మళ్లీ మళ్ళీ తీసుకోండి.

దశ 2:

ఇప్పుడు మీ శరీరంలోని ఉద్రేకాలను తగ్గించండి. మీ కాలి వేళ్ళను సాగదీయండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి. మీ పిక్క కండరాలను బిగించండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి. మీ పై కాళ్లు మరియు తొడలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి. మీ పొట్ట భాగంలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి. మీ భుజాలను వెనక్కిలాగండి. వాటికి విశ్రాంతినివ్వండి. మీ భుజాలను పైకి క్రిందికి తట్టండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి. ఎడమవైపుకు చూడండి. ముందుకు చూడండి.కుడి వైపుకు చూడండి. మళ్ళీ ముందుకు చూడండి. మీ ముఖంలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి. ఇప్పుడు మీ శరీరం మొత్తం విశ్రాంతిని పొందినట్లుగా అనుభూతిని‌ పొందండి. అన్ని ఉద్రేకాలు తొలిగిపోతాయి.

దశ 3:

మీకు ఇష్టమైన ప్రదేశంలో, సంగీతాన్ని వింటూ నడుస్తున్నట్లుగా ఊహించుకోండి. అక్కడ చాలా అందంగా ఉంది. పక్షుల కిలకిల రావాలతో మీరు సంతోషంగా, సంతృప్తిగా ఉన్నారు. విశాలంగా ఉన్న నీలిరంగు ఆకాశం వైపు చూడండి. ఆకాశం లాగా మీరు కూడా పెద్దగా అవుతూ, విస్తరిస్తున్నట్లుగా ఊహించుకోండి. సూర్యుడు తన కాంతికిరణాలను మరియు ప్రేమను భూమిపై పంపుతూ ఎంతో తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. చుట్టూ ఉన్న ప్రకృతిలోని ప్రతి అణువణువు అందంగా ఉంది. మీకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి కనుక మీరు ఆనందిస్తూ, మానవులు, జంతువులు, మొక్కలు, చేపలు, రాళ్లు ఈ విధంగా మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి ప్రేమ మరియు శాంతికిరణాలను ప్రవహింప చేయండి. అందువలన మీరు ఎంతో సంతోషాన్ని పొందుతారు.

దశ 4:

ఇప్పుడు మీ దృష్టిని తరగతి గదికి తీసుకురండి, వ్యాయామం పూర్తయినందునది మీ కళ్ళను విప్పార్చి, మీపక్కన ఉన్న వ్యక్తిని చూసి నవ్వండి.

(శ్రీ సత్య సాయి మానవతా విలువల బోధన ఆధారంగా)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *