Creating Game Materials-te

Print Friendly, PDF & Email

Creating Game Materials

“జీవితం ఒక ఆట- ఆడుతూ ఉండు”- బాబా.

బాలవికాస్ లో సామూహిక కార్యక్రమాలలో విలువలతో కూడిన ఆటలకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఈ ఆటలలో దేవుడు చెప్పాడు, పాము- నిచ్చెన లాంటి ఎన్నో ముఖ్యమైన ఆటలున్నాయి. ఈ ఆటలకు సంబంధించిన గేమ్ బోర్డులను గురువు సిద్ధంగా ఉంచుకోవాలి.

ఉదా: ధర్మచక్రం, జిగ్ సా పజిల్ చిప్స్ మరియు జతపరుచు లాంటి ఆటలు ఆడేందుకు కార్డు బోర్డులతో తయారుచేసిన మ్యాచింగ్ కార్డులు అవసరమవుతాయి. కొన్ని సందర్భాలలో ఉదాహరణకు భజగోవిందం లాంటి పద్యాలను చిన్న కార్టన్లపై పద్యంలోని ప్రతిపదం లేదా 2,3 పదాలు కలిపి వ్రాయాలి. పిల్లలు ఇలాంటి వినోదాన్ని కలిగించే ఆటలను ఆడటం వలన సంక్లిష్ట భావనలపై వారి అవగాహనను నిలుపుకుంటారు. గ్రూప్ 3 పిల్లలకు ప్రాజెక్టు వర్క్ లలో ఇలా ఆటలను సృష్టించే అద్భుతమైన పని అప్పగించవచ్చు. వారి వద్ద ఉన్న వ్యర్ధపదార్థాలతో తయారు చేయించవచ్చు. అందరూ కలిసి చేయడం ద్వారా వారికి వ్యర్ధాల నుంచి పనికి వచ్చేవి ఎలా చేయాలో తెలియడం ద్వారా ఎంతో పొదుపు చేయగలుగుతారు. పిల్లలలోని వివిధ రకాల ప్రతిభను వెలికి తీయవచ్చు. కొందరు క్రాఫ్ట్ భాగాలు కొందరు రంగులు వేయడం కొందరు వాటిపై వ్రాయడం మొదలైనవి వారి గురువుల మార్గదర్శకత్వంలో చేయవచ్చు.

సామూహిక కార్యక్రమం: భజగోవిందం

కలుపు -జోడించు. ఈ ఆట ద్వారా పిల్లలు బాలవికాస్ లో వారు నేర్చుకున్న భజగోవిందం మరలా గుర్తు చేసుకోగలుగుతారు.

ఆడించే విధానం :గురువు పిల్లలను మూడు నాలుగు గ్రూపులుగా చేస్తారు. గురువు భజగోవిందం నుంచి ఏదైనా నాలుగు పద్యాలు ఎంపిక చేసుకోవాలి .ప్రతి పద్యంలో నుంచి నాలుగు లైన్లు తీసుకుని వాటిని ఎనిమిది భాగాలుగా చేయాలి. ప్రతిభాగాన్ని బాక్స్ కి ఒక వైపు రాయాలి. ఇప్పుడు బాక్సులు ఆడటానికి సిద్ధంగా ఉన్నాయి. గురువు ఆ బాక్సులు అన్నిటిని కలపాలి .మొదటి పదాలను ఒక్కొక్క గ్రూప్ కు ఇవ్వాలి. గ్రూప్లో ఉన్నవారు బాక్సుల్లోని పదాలను చేర్చి భజగోవిందం పద్యాన్ని తయారు చేయాలి.

యోగరతోవ భోగరతోవ సంగర తోవా సంగ విహీనః యస్య బ్రాహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్వేవా. విలువలు-పరిశోధనా శక్తి, జ్ఞాపకశక్తి, భక్తి, ఓర్పు, విచక్షణ శక్తి.

ఈ ఆట ద్వారా పిల్లలు భజగోవిందం శ్లోకాన్ని పాడుతూ నేర్చుకుంటారు ఎలా అంటే శ్లోకంలోని ప్రతి పదాన్ని సరైన స్థానంలో పెట్టేవరకు వల్లే వేస్తుంటారు. కాబట్టి త్వరగా నేర్చుకోగలుగుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *