పట్టుదల

Print Friendly, PDF & Email
పట్టుదల
సంకల్పశక్తిని గురించి తెలుసుకొనుటకై అభ్యాసము.

(ఉపాధ్యాయుడు చుక్కల వద్ద పాజ్ చేస్తూ నెమ్మదిగా వ్యాయామాన్ని చదువుతాడు. మీరు అవసరమనుకుంటే, నేపథ్యంలో మృదువైన సంగీతాన్ని పెట్టుకొనవచ్చు.).

దశ 1:

సౌకర్యవంతమైన స్థితిలో కుర్చీ మీద కానీ, నేల మీద స్థిరాసనంలో కానీ కూర్చోండి. మీ వెన్నెముకను, తలను నిటారుగా ఉంచండి.

మెల్లగా దీర్ఘశ్వాసను తీసుకుని, తిరిగి మెల్లగా బయటకు వదలండి.

కొద్దిగా విశ్రాంతి తీసుకుని, దీర్ఘశ్వాసను మళ్లీ మళ్ళీ తీసుకోండి.

దశ 2:

ఇప్పుడు మీ శరీరంలోని ఉద్రిక్తతలను తగ్గించండి. మీ కాలివేళ్ళని సాగదీయండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి. మీ పిక్క కండరాలను బిగించండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి. మీ పై కాళ్లు మరియు తొడలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి.

మీ పొట్ట భాగంలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి. మీ భుజాలను వెనక్కిలాగండి. వాటికి విశ్రాంతినివ్వండి. మీ భుజాలను పైకి క్రిందికి తట్టండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి. ఎడమవైపుకు చూడండి. ముందుకు చూడండి.కుడి వైపుకు చూడండి. మళ్ళీ ముందుకు చూడండి. మీ ముఖంలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి. ఇప్పుడు మీ శరీరం మొత్తం విశ్రాంతిని పొందినట్లుగా అనుభూతిని‌ పొందండి. అన్ని ఉద్రిక్తతలు తొలిగిపోతాయి.

దశ 3:

మీరు ఇదివరకు గడిపిన కాలాన్ని గురించి ఆలోచించండి. అది కష్టమైనప్పటికీ మీరేలా ఆ కాలాన్ని గడిపారు?.ఆ అనుభవం మీకెలా అనిపించింది?

మీరు చేయాలనుకున్న పనిని చేయడంలో, మీరు విఫలమైన లేక చేయలేకపోయిన సమయం గురించి ఆలోచించండి. అది ఎలా అనిపించింది?

మీరు ఆ పనిని మళ్లీ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఊహించుకోండి… మళ్లీ విఫలమవుతున్నట్లుగా, మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తున్నట్లుగా ఊహించుకోండి. మీరు విఫలమైన ప్రతిసారీ మళ్లీ ప్రయత్నిస్తున్నారు.

మీరు విజయం సాధించినట్లు ఊహించుకోండి.. మీ సాధనలోని పట్టుదలను ఊహించుకోండి… అది మీకు ఎలా అనిపిస్తుంది? ఒక సంకల్పాన్ని అమలు పరచాలని నిర్ణయించుకున్నందుకు, దాని సాధించే వరకు మీరు మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ పట్టుదలకు మీ వెన్ను మీరు తట్టుకోండి. మిమ్మల్ని మీరు అభినందించుకోండి. మీరు చివరి వరకు పట్టుదలతో ప్రయత్నిస్తూనే ఉంటే విజయం సాధిస్తారని తెలుసుకోండి.

దశ 4:

ఇప్పుడు మీ దృష్టిని తిరిగి తరగతి గదికి తీసుకుని రండి. వ్యాయామం పూర్తయినది కనుక, మీ కళ్ళను తెరిచి విప్పార్చండి. మీ పక్కన ఉన్న వారిని చూసి నవ్వండి.

(శ్రీ సత్య సాయి మానవతా విలువల బోధన ఆధారంగా)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *