దిల్ మే రామ్ హాత్ మే కాం
దిల్ మే రామ్ హాత్ మే కాం
బాలవికాస్ పిల్లలు కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సేవాదళ్ సభ్యులుగా సేవ చేయవచ్చు .శిక్షణ పొందిన సేవా సమితి మరియు జిల్లా కార్యక్రమాలలో సేవ చేయవచ్చు .మీరు ఈ క్రింద ఇచ్చిన సేవలలో ఈ విధంగా పాల్గొనవచ్చు.
a) నారాయణ సేవ:
- టేబుల్స్ అమర్చటం, శుభ్రం చేయడం, ప్లేట్లను తుడవడం, మరియు ఆరబెట్టడం.
b) వేసవి శిబిరాలు:-
- ఎండాకాలం ప్రజలకు చల్లని నీరు, మజ్జిగ అందివ్వవచ్చు.
c) వైద్య శిబిరాలు (రక్త శిబిరాలు,కంటి శిబిరాలు)
తయారీ:
- శుభ్రపరచడం
- పోస్టర్లుఅంటించడం
- వివిధ ప్రయోజనాల కోసం గదులను కేటాయించడం
మొదటి రోజు
- రోగుల పేర్లు వివరాల నమోదు.
- శ్రద్ధ ప్రేమతో రోగులకు గదులను చూపించడం
- నీటిని అందించడం.
గమనిక:- బాలవికాస్ విద్యార్థులు సేవాదళ్ వారు ఇచ్చిన సూచనలను మాత్రమే పాటించాలి. వారి స్వంత నిర్ణయాలను తీసుకోరాదు.
d) విభూతి ప్యాకెట్లు:
“పరమం పవిత్రం బాబా విభూతం” – విభూతి మంత్రం విద్యార్థులు సాయి భజనల తరువాత క్రొత్త భక్తులకు పంపిణీ చేయడం కొరకు చిన్నచిన్న విభూతి పొట్లాలని తయారు చేయడంలో సేవాదళ్ కు సహాయం చేయవచ్చు.
e)పుణ్యక్షేత్రం అలంకరణలు
మందిరంలో జరిగే భజనలకు, పండుగలకు రంగోలిలు, పూలు అలంకరించడంలో సహాయం చేయడానికి ఇష్టపడతారు. బాలవికాస్ విద్యార్థులకు ఇలా చిన్నచిన్న కార్యక్రమాలలో పాల్గొనేలా చేస్తే భవిష్యత్తులో మంచి సేవాదళ్ గా సంస్థలో సేవ చేస్తారు.