చిత్రాలు -వాటి వివరణ
చిత్రాలు -వాటి వివరణ
కథలలోని సన్నివేశాలను రంగులతో చిత్రీకరించినట్లయితే అవి పిల్లలకు ఆకర్షణీయంగా ఉండి విలువలను అందించడంలో ఎంతో దోహదపడతాయి.
కథలలో రంగు రంగుల సెట్టింగ్స్, పాత్రలు, హావభావాలు ఉండటం వలన పిల్లలను వెంటనే ఆకర్షిస్తాయి. ఇది పిల్లలలో విశ్లేషణకు, నైపుణ్యాలను పెంపొందించేందుకు అలాగే వారిలో అంతర్లీనంగా ఉన్న కళా సంపదను వెలికి తీసి ఆనందాన్ని అనుభవించేలా చేయడానికి ఒక గొప్ప సాధనం. ఈ ప్రక్రియలో వివరణతో కూడిన ఉదాహరణలు చాలా కీలకపాత్ర వహిస్తాయి. అందుకు ఉదాహరణ సింధురాసురుని కథ.
స్వామి యొక్క జీవితమే స్వామి సందేశం. స్వామి జీవిత చరిత్రలోని చిన్న చిన్న సంఘటనలే కథల రూపంలో బాలవికాస్ పిల్లలకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. దానివలన పిల్లలు స్వామితోను, ఆయన బోధనలతో సులభంగా సంబంధం కలిగి ఉంటారు. గ్రూప్-3 పిల్లలలో నైపుణ్యం కలవారికి అనేక చిన్న కథలు ఉదాహరణలుగా ఇచ్చి వారితో చిత్రాలను గీయించవచ్చు.