దుస్తులు ( వస్త్ర ధారణ) అలవాట్లు
దుస్తులు (వస్త్ర ధారణ) అలవాట్లు
దుస్తుల అలవాట్లు పాక్షికంగా వాతావరణం మరియు మతాచారాల మీద ఆధారపడి ఉంటాయి. భారత దేశంలో ప్రతి మతానికి దాని స్వంత వస్త్ర ధారణ ఉంటుంది. ప్రతి మతంలో కులం, శాఖా వృత్తి బేధాలతో ప్రజలు ధరించే దుస్తులు వ్యక్తపరుస్తాయి. వస్త్ర ధారణలో విదేశీ ప్రభావం విస్మరించరానిది. చీర అనేది స్త్రీలకు ధోవతి జుబ్బా పురుషులకు సర్వ సాధారణమైనవి.
పంజాబ్ వారు సల్వార్ లేదా బ్యాగీ ప్యాంటు తమ దుస్తులుగా ధరిస్తారు. బెంగాల్ మరియు ఉత్తర ప్రదేశ్ వారు ముస్లిం, విదేశీ ప్రభావం ఉన్నప్పటికీ శతాబ్దాలుగా ధోవతికి ప్రాధాన్యత ఇచ్చారు. సిక్కులు ధోవతి పట్టించుకోకుండా వదులైన చొక్కాలు పైజామాలు తలపాగా ధరిస్తారు. తలపాగా మతపరమైన చిహ్నం. తలమీద ధరించే వాటికి ప్రాంతాల వారీగా తేడా ఉంది. చాలా ప్రాంతాల్లో తల మీద టోపీ ఏమీ ధరించరు. కొన్ని ప్రాంతాల్లో తమ ప్రత్యేకతను సూచించే విధంగా టోపీ ధరిస్తారు. షేర్వాణీలు ఉన్నత పదవుల హొదాగా మారాయి.
భారతీయ పురుషులు, స్త్రీలు ధరించే దుస్తులు చూడాలంటే కళ్ళు విప్పుకుని చూడాల్సిందే. సాంప్రదాయ భారతీయ దుస్తులు వివిధ ప్రాంతాల్లోని వాతావరణానికి అనుగుణంగా ఉంటాయి. మన దేశంలో యువకులు, వృద్ధులు సాంప్రదాయ దుస్తులు ధరించడం చిన్న చూపు ధోరణి కలిగి ఉంటారు.
ఇది ఇతరుల పట్ల మన సంస్కారం అవగాహన లోపాన్ని తెలుపుతుంది. బట్టల యొక్క ప్రయోజనం శరీరాన్ని కప్పి ఉంచడమే. వేడి, చలి నుంచి రక్షణ కోసం మాత్రమే. విదేశీ, ఫ్యాషన్ దుస్తుల కన్న శుభ్రమైన దుస్తులు ధరించడం ముఖ్యం. ఎవరు ఎలాంటివి ధరిస్తారు అనే దాని కన్నా ఎలా ధరిస్తున్నారు అనేది చాలా ముఖ్యమైనది. ప్రాచీన ఆచార్యులు చెప్పినట్లు ఉత్తమ దుస్తులదే నిజమైన పాత్ర.