మూగ చారెడ్స్
మూగ చారెడ్స్
లక్ష్యం:
ఈ సరళమైన, ఇంకా క్లాసిక్ గేమ్ పిల్లలను వారి సీట్ల నుండి లేచి వారి నాటకీయ/నటనా నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఒక గొప్ప మార్గం.
ఇందులో దేవతలు, సాధువులు మరియు ఇతరుల పేర్లను సూచించే పదాన్ని కేవలం నటన ద్వారా వివరించడంతో పాటు, ఆ పదాన్ని చాలా స్పష్టంగా వివరించడానికి చేసే సంజ్ఞలు మరియు వ్యక్తీకరణలు (నోటితో మాటలు కాకుండా) ఒకదాని తరువాత ఒకటి ఉంటాయి. మిగిలిన తరగతి వారు ఆ పదాన్ని సులభంగా ఊహించేలా ఉంటుంది.
అలాగే, ఈ గేమ్ ఇతరులతో సంభాషించేటప్పుడు వారి యొక్క ముఖ కవళికలు, భావోద్వేగాలు మరియు శరీర భాషను అర్థం చేసుకోవడానికి మరియు చదవడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ గేమ్ వారికి తెలిసిన పాత్రలను దృశ్యమానం చేయడానికి మరియు వారి ప్రత్యేక లక్షణాల గురించి మరింత తెలుసుకోవడానికి వారి ఊహను మెరుగుపరుస్తుంది.
సంబంధిత విలువలు:
- అప్రమత్తత
- పరిశీలన
- సహనం
- టీమ్ వర్క్
- బంధం
అవసరమైన పదార్థాలు:
- కాగితం మరియు పెన్
- పదాల జాబితా
- పై జాబితా నుండి ఒక పదాన్ని కలిగి వున్న చిన్న స్లిప్పులు.
గురువు కోసం సన్నాహక పని:
జాబితాను సిద్ధం చేయండి:
- దేవతల పేర్లు – చంద్రశేఖర్, నీలకంట్, గంగాధర్, గిరిధర్, శ్రీరామ్, హనుమాన్, లంబోదర్, ఏకదంత్ , లంబోదర్, నటరాజ్, కృష్ణ, పార్థసారథి, మురళీధర్, మురుగన్, కాళి, విష్ణువు, సరస్వతి, విట్టల్, నరసింహ, జీసస్, బుద్ధుడు.
- సాధువులు/ఋషులు – అవ్వయ్యార్, మీరాబాయి, వివేకానంద, చైతన్య మహాప్రభు, నారదుడు.
- వ్యక్తులు – అర్జున్, గాంధీజీ, బాలగంగాధర్ తిలక్, బోస్, రాణి లక్ష్మీబాయి, శివాజీ మహారాజ్, కవి భారతి, మదర్ థెరిసా.
- పండుగలు – హోలీ, దీపావళి, దసరా నవరాత్రి, క్రిస్మస్, రక్షాబంధన్, ఈద్, స్వాతంత్రయ స్వాతంత్రయ దినోత్సవము
- 5 మూలకాలు – భూమి, అగ్ని, నీరు, గాలి, ఆకాశం.
ఎలా ఆడాలి
- గురువు తరగతిని రెండు గ్రూపులుగా విభజిస్తారు.
- గ్రూప్ A నుండి ఒక పిల్లవాడిని తరగతి ముందు నిలబడమని అడగాలి.
- గురువు అతనికి ఒక స్లిప్ ఇచ్చి, ఎటువంటి మౌఖిక ఆధారాలు ఇవ్వకుండా, అతని స్లిప్‌పై వ్రాసిన పదాన్ని నటించ మని అడగాలి.
- గ్రూప్ A నుండి పిల్లవాడు ఏమి నటించడానికి ప్రయత్నిస్తున్నాడో ఇతర సమూహం తప్పనిసరిగా ఊహించాలి. ఒక్కొక్కరుగా తమ అంచనాలు తెలపాలి.
- గ్రూప్ B నుండి సరిగ్గా ఊహించిన పిల్లవాడు గురువు సూచించిన తదుపరి పదాన్ని అమలు చేసే అవకాశాన్ని పొందుతాడు.
- గేమ్ గొప్ప ఉత్సాహంతో మరియు సరదాగా ఈ పద్ధతిలో కొనసాగుతుంది!!!