భూమి (2)
భూమి (2)
ప్రియమైన పిల్లలూ,
పంచభూతాలు భగవంతుని దివ్యమైన అంశలు. మన మాతృభూమి వాటిలో ఒకటి. మనం ఆమెను భూదేవి,భూమాత ధరిత్రి అని పూజిస్తాం. మనం భూమి వల్లే జీవించగలుగుతున్నాం. భూమి శబ్ద,స్పర్శ,రూప,రస,గంధం అనే ఐదు లక్షణాలు కలిగి ఉంటుంది.
కళ్ళు మూసుకొని,మనల్ని భరించే భూమాతను ఊహించుకుందాం.
భూమి ఎలాంటి ఆశలు లేకుండా మొత్తం ప్రపంచానికి సేవ చేస్తోంది. భూమిపైన,ఎత్తైన పర్వతాలు ప్రవహించే పొడవైన నదులు, చిన్న పెద్ద సరస్సులు, చెరువులు నిండి ఉన్నాయి. ఎత్తైన టవర్లు,భవనాలు భూమ్మీద నిలబడి ఉన్నాయి. ప్రపంచానికి అన్ని ఆహార పదార్థాలను తనపైన పండించి అందిస్తుంది.
“ఓ! భూమాత మేము నిన్ను నాగలితో తవ్వుతాం. కానీ నీవు మాకు ఆహారాన్ని,కలప,బొగ్గు, ఖనిజాలు ఇస్తావు. నీవు నాకు తల్లి లాంటి దానివి. మేము నీ బిడ్డలం. మనందరం భూమాత సంతానం”.
ఇదే మళ్లీ మళ్లీ అనుకోండి.
“ఓ! భూమాతా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నీ బిడ్డను. ఇప్పుడు మీ అరచేతులు రుద్దుకోండి. వేడిని కళ్ళకు ఆనించండి. ముఖాన్ని కూడా తుడుచుకోండి.”
తరగతిలో చర్చ:
The path of Patience- Lessons from Earth, along with mountains and trees (Prithvi)
పర్వతాలు, చెట్లు, భూమి నుంచి నేర్చుకున్న పాఠాలు. సహనం ఓపిక, క్షమ.
ప్రశ్నలు :
- పంచభూతాల పేర్లు ఏమిటి?
- భూమి నుంచి మనం ఏం పొందుతాం?
- భూమాతను ఎలా కాపాడుకోవాలి.
[English Ref: Silence to Sai-lens – A Handbook for Children, Parents and Teachers by Chithra Narayan & Gayeetree Ramchurn Samboo MSK – A Institute of Sathya Sai Education – Mauritius Publications]