నిర్భయత్వం

Print Friendly, PDF & Email
నిర్భయత్వం

ఉపాధ్యాయుడు వ్యాయామాన్ని నెమ్మదిగా సూచిస్తాడు.ఆ సూచనలను అనుసరించండి. ఫుల్ స్టాప్ ల వద్ద నిలుపుతాడు.. అవసరమైతే నేపథ్యంలో మధువైన సంగీతాన్ని వినిపిస్తాడు.

దశ 1 :

  1. సౌకర్యవంతమైన స్థితిలో కుర్చీ మీద కానీ, నేల మీద స్థిరాసనంలో కానీ కూర్చోండి.
  2. మీ వెన్నెముకను, తలను నిటారుగా ఉంచండి.
  3. మెల్లగా దీర్ఘశ్వాసను తీసుకుని, తిరిగి మెల్లగా బయటకు వదలండి.
  4. కొద్దిగా విశ్రాంతి తీసుకుని, దీర్ఘశ్వాసను మళ్లీ మళ్ళీ తీసుకోండి.

దశ 2:

ఇప్పుడు మీ శరీరంలోని ఉద్రేకాలను తగ్గించండి. మీ కాలి వేళ్ళని సాగదీయండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి. మీ పిక్క కండరాలను బిగించండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి.

మీ పై కాళ్లు మరియు తొడలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి. మీ పొట్ట భాగంలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి. మీ భుజాలను వెనక్కిలాగండి. వాటికి విశ్రాంతినివ్వండి. మీ భుజాలను పైకి క్రిందికి తట్టండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి. ఎడమవైపుకు చూడండి. ముందుకు తిరిగి కుడి వైపుకు చూడండి. ముందుకు చూడండి. మీ ముఖంలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి. ఇప్పుడు మీ శరీరం మొత్తం విశ్రాంతిని పొందినట్లుగా అనుభూతిని‌ పొందండి. ఉద్రేకాలు అన్నీ తొలిగిపోతాయి.

దశ 3:

ఇప్పుడు మీకు ఇబ్బంది కలిగించే సమస్య ఏదైనా ఉన్నచో, దానిని ఊహించుకోండి.ఇబ్బంది కలిగించే ఆ సమస్యను మీరు మనసులో తల్చుకున్నప్పుడు, మీరు ఒక బంగారు కాంతితో ఉన్న బుడగలో సురక్షితంగా ఉన్నట్లుగా ఊహించుకోండి. ఆ బుడగ ఎలా ఉందో కూడా ఊహించుకోండి. అది చాలా పెద్దదిగా ఉంది. మీరు దానిని తాకాలనుకున్నా కూడా తాకలేరు. ఎందుకంటే అది సాగిపోతూ పెద్దదిగా అవుతుంది కనుక. అంతేకాక అది చాలా దృఢంగా ఉంది. దాని లోపలికి ఎటువంటి చెడు ప్రవేశించదు. అక్కడ మీరు చాలా సురక్షితంగా ఉంటారు. ఇప్పుడు మీరు ఇబ్బంది కలిగించే సమస్యను మీరు గమనించిన కొద్దీ, అది చాలా చిన్నదిగా మారిపోతుంది. అప్పుడు మీరు ఇంకా దృఢంగా అవుతారు “మిమ్మల్ని ఇబ్బంది కలిగించే విషయము మీరు చూస్తుండగానే మాయమైతుంది” అనే విషయాన్ని మీరు గ్రహించారు కనుక దీనిని మీరు ఎవరికైనా చెప్పవచ్చు. మళ్లీ ఆ సమస్య తిరిగి ఎదురైనప్పటికీ మిమ్మల్ని భయపెట్టదు.

దశ 4:

ఇప్పుడు దృష్టిని తిరిగి తరగతి గదికి తీసుకుని రండి. వ్యాయామం పూర్తి అయినది కనుక మీ కళ్ళను తెరిచి విప్పార్చండి. మీ పక్కన ఉన్న వారిని చూసి నవ్వండి. కూర్చుని చేసే ఈ వ్యాయామం యొక్క అనుభవాలను విద్యార్థులు పక్కవారితో పంచుకోవాలని అనుకోవచ్చు కనుక వారిని ప్రోత్సహించండి.ఈ వ్యాయామం వలన వారు ఎటువంటి అనుభూతిని పొందారో అడగండి. ఆ అనుభూతిని చిత్రంగా గీయమని ప్రోత్సహించడం వల్ల పిల్లలలో సృజనాత్మకత పెంపొందుతుంది.

[BISSE Ltd శ్రీ సత్యసాయి మానవతా విలువల బోధని ఆధారంగా.]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *