పండుగలు
పండుగలు
భారత దేశం మతపరమైన పండుగలకు ప్రసిద్ధి చెందింది. భారత దేశంలో ఉన్న మతపరమైన పండుగలు బహుశా మరే దేశంలోనూ లేవు. అన్ని భారతీయ సమూహాలకు వాటి మతపరమైన పండుగలు ఉన్నాయి. అవి సామూహికంగా ఉంటాయి. హిందువులు శివరాత్రి ఉపవాసం ప్రార్థనలు మరియు జాగరణ రాత్రి మేలుకుని ఉండటం చేస్తారు. స్వీయ శుద్ధి స్వీయ నిగ్రహం కోసం చంద్రుడు లేని రోజుల్లో కృష్ణ పక్షం లో పదకొండవ రోజున ఏకాదశీ ఉపవాసం చేస్తారు. ముస్లింలు రంజాన్ మాసం లో ఉపవాసం చేస్తారు. సబ్-ఎ- కద్దర్ చంద్రుడు లేని రాత్రి అంటారు భక్తులు మేల్కొని అల్లాహ్ అనుగ్రహం కోసం ప్రార్థనలు చేస్తారు. మళ్ళీ 8 వ చంద్ర మానంలో 14వ రోజు ముస్లింలు మేల్కొని శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేస్తారు. చాంద్రమానం 7వ నెలలో 27 వ రోజు రాత్రి షబ్ ఎ మిరాజ్ అని మేల్కొని ప్రార్థనలు చేస్తారు. దీన్ని ఆరోహణ రాత్రి అంటారు మహమ్మద్ ప్రవక్త ఆరోజు దేవునితో కలిసిన రోజుగా భావిస్తారు.
క్రైస్తవులు గుడ్ ఫ్రైడే రోజున ఉపవాసం చేసి చర్చి లో మూడు గంటలు ప్రార్థన బైబిల్ చదవడం చేస్తారు. నలభై రోజులు ఆదివారాలు మినహా ఈ కాలం ఉంటుంది. క్రీస్తు దేవుని ఆరాధించే ముందు నలభై రోజులు అరణ్యంలో ఉన్నారు. నలభై రోజులు స్వీయ శుద్ధి స్వీయ పరిశీలన మరియు దేవునికి దగ్గరగా ఉండటానికి ప్రార్థన చేస్తారు ఇది యాష్ బుధవారం.
ప్రారంభమవుతుంది. బూడిద పవిత్రతకు సరళతకు పశ్చాత్తాపంకు చిహ్నం. హిందువులు క్రైస్తవులు విభూతిని పవిత్రంగా భావిస్తారు ఉపవాసం తో ఆత్మ శుద్ది జరుగుతుంది అని అన్ని మతాలు ఆచరిస్తారు.
అన్ని ప్రధాన మతాల వారు వారి ప్రవక్తల జీవితాలకు సంబంధించినవి లేదా వారి దేవుని అవతారాలకు సంబంధించిన పండుగలు కలిగి ఉంటారు. దేవుళ్ళ సంగతులను స్మరించుకుంటారు. గోకులాష్టమి మహాశివరాత్రి దసరా పండుగలన్నీ దేవుడితో సంబంధాలను కలిగి ఉంటాయి. ముస్లింలు రంజాన్ బక్రీద్ ఈదుల్ ఫితర్ మరియు క్రిస్మస్ క్రైస్తవులకు క్రిస్తు పుట్టిన పండుగ. భారత దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అన్ని పండుగలను జరుపుకుంటారు గ్రామ దేవతలను పూజిస్తారు. విచిత్రం ఏమిటంటే హిందువులు క్రైస్తవులు ముస్లింలు అందరూ కలిసి సుహృద్భావంతో జరుపుకుంటారు. బాబా చెప్పినట్లు మానవత్వం కులం ఒకటే ఉన్నది ఒక్కటే మతం అది ప్రేమ మతం.
ప్రజలు లోతైన మత విశ్వాసాలను కలిగి ఉంటారు. మతానికి అతీతంగా జీవితాన్ని ఆలోచించడం సాధ్యం కాదు. భారతీయులు వారి మతం ఏదైనా అందరి యందు ఆప్యాయత అనురాగాలు ప్రేమ కలిగి ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలంగా ఉంటాయి. యువకులు పెద్దలను గౌరవిస్తారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకుంటారు పాత సంప్రదాయాలను పాటించడం, యువకుల్లో నైతికత పెంపొందించడానికి ప్రయత్నం చేస్తారు.
సహనం సహకారం సమన్వయం తో గడుపుతూ పురాణాలు మత గ్రంథాలు ఆచారాలు సాహిత్యం లలిత కళలు వాటి గౌరవం నిలుపుతారు. గతానికి వర్తమానానికి అర్థవంతమైన సమన్వయానికి ప్రయత్నిస్తారు.
మన గొప్ప వారసత్వానికి మనం అర్హులమని నిరూపించుకుందాం. సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస అయిదు సూత్రాలు మన సనాతన ధర్మానికి పంచశీలలు. సత్య దృక్పథంతో జీవిస్తూ ప్రేమ మరియు జీవత స్వచ్ఛత తో సాయి సందేశాన్ని వ్యాప్తి చేయడానికి, ప్రపంచానికి సంతోషకరమైన ప్రదేశంగా మార్చడానికి ప్రయత్నించుదాం. వందే మాతరం !
- ఉన్నది ఒక్కటే మతం ప్రేమ మతం
- ఉన్నది ఒక్కటే కులం మానవ కులం
- ఉన్నది ఒక్కటే భాష అది హృదయ భాష
- దేవుడు ఒక్కడే అతడు సర్వ వ్యాపి