అగ్ని

Print Friendly, PDF & Email
Guided Visualisation Fire

అగ్ని

ప్రియమైన పిల్లలూ,

నిటారుగా కూర్చోండి. విశ్రాంతి తీసుకోండి. ఊపిరి దీర్ఘంగా తీసుకొని, నెమ్మదిగా వదలండి. ఇప్పుడు మనం వెలుగును చూపే అగ్నిని చూడబోతున్నాం.

అగ్నికి అగ్ని దేవుడు అని పేరు. మనం ఆగ్నిని పూజిస్తాం. హోమం చేస్తాం.

అగ్నిజ్వాలతో దేవుడికి హారతి ఇస్తాం. మెల్లగా కళ్ళు మూసుకోండి. మనం అగ్ని దగ్గర కూర్చున్నప్పుడు,అనుభవించే వేడిని అనుభవించబోతున్నాం.

రోజూ, తెల్లవారగానే మీరు మంచం నుంచి త్వరగా లేచి, ఉదయం ప్రార్ధన చేయాలి. బయటకు వెళ్లి సూర్యుని చూడండి. సూర్యుని కాంతి రాత్రి అనే చీకటిని తొలగించి, అంతటా వెలుగును వ్యాప్తి చేస్తుంది. ఎండలో కొద్దిసేపు నిలబడి సూర్యుని వెచ్చదనాన్ని అనుభవించండి. స్నానం చేశాక ఉతికిన బట్టలు కూడా ఎండలోనే ఆరేస్తారు. అవి ఎండ వేడికి ఆరిపోతాయి. ఎండ కావలసిన శక్తిని ఇస్తుంది.

మీకు మీ ప్రియమైన అమ్మ అగ్ని మీదే వండిన వేడి వేడి టిఫిన్ అందిస్తుంది. మధ్యాహ్న సమయంలో సూర్యుడు మరింత వేడి కలిగిస్తాడు. మీరు కూడా మధ్యాహ్నం రుచికరమైన భోజనాన్ని తీసుకుంటారు. అది కూడా నిప్పు మీదే తయారవుతుంది. రోజంతా, సూర్యుడు వెలుగును వేడిని ఇస్తాడు. సాయంత్రం అవగానే చల్లబడుతుంది. రాత్రి చంద్రుడు కాంతిని అందిస్తాడు. చీకటి పడగానే పూజా మందిరంలో దీపాన్ని వెలిగిస్తాం. సువాసనతో కూడిన ధూపాన్ని వెలిగిస్తాం. వెలుతురు ఉన్నప్పుడు చీకటి ఉండదు. అగ్ని అన్నిటినీ కాలుస్తోంది.

అలాగే మనలో చెడునంతటినీ జ్ఞానం అనే అగ్ని తొలగిస్తుంది. చెడు తొలగితే మంచి ఆలోచనలే మిగులుతాయి. అగ్నిజ్వాల ఎప్పుడు పైకి పైకి పెరుగుతుంది. అదేవిధంగా మనం ఎప్పుడు ఉన్నతమైన ఆలోచనలు, ఆదర్శాలు కలిగి ఉండాలి.

ఈ మాటలు చెప్పండి

“ఓ దేవా నన్ను చీకటి నుంచి వెలుగులోకి నడిపించండి. ఇప్పుడు కళ్ళు తెరవండి.”

తరగతి చర్చ:

ప్రశ్నలు:
  1. మీరు ఏమి చూశారు?
  2. మీరు అగ్నిని చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది.?
  3. అగ్ని యొక్క లక్షణాలు ఏమిటి?

[English Ref: Silence to Sai-lens – A Handbook for Children, Parents and Teachers by Chithra Narayan & Gayeetree Ramchurn Samboo MSK – A Institute of Sathya Sai Education – Mauritius Publications]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *