ఆహారపు అలవాట్లు
ఆహారపు అలవాట్లు
ప్రజల ఆహారపు అలవాట్లు వారి ప్రాంతం యొక్క వాతావరణం మరియు దాని భౌగోళికం పై చాలా వరకు ఆధారపడి ఉంటాయి. భారత దేశంలోని పర్వత, చలి ప్రాంతాల్లో మాంసం తినడం సర్వసాధారణం. తీర ప్రాంతాల్లో చేపలు ఎక్కువగా తింటారు మైదాన ప్రాంతాల వారు ఆహార ధాన్యాలు కూరగాయలు ఎక్కువగా పండిస్తారు కాబట్టి వారి మనుగడ కోసం మాంసం చేపల మీద ఆధారపడరు. ఆహారపు అలవాట్లు సాధారణంగా ఆయా వాతావరణం భౌగోళిక స్వరూపం మీద ఆధారపడినప్పటికీ వారి మతాచారాలు విలువలు ద్వారా ప్రభావితం అవుతాయి. మాంసాహారం తినడం సహజమైన విషయంగా చాలా మంది హిందువులు భావించినా
చాలామంది దీన్ని నిరాకరిస్తారు. ముస్లిములు సాధారణంగా మాంసాహారం భుజించినా కొన్ని రకాల మాంసాలు తినరు.
చాలామంది హిందువులు చేపలు మాంసం ఎందుకు వ్యతిరేకిస్తారో తెలుసుకోవడం ముఖ్యం. ఆహారం కోసం ప్రాణం ఉన్న చేపలు జంతువులను చంపడం దేవుడు సృష్టించిన నిస్సహాయ ప్రాణులను చంపడం దురాక్రమణ చర్యగా చాలా మంది హిందువుల నమ్మకం. చేపలు ఇతర జంతువుల మాంసం సాత్విక ఆహారం కాదు అది శరీరానికి మంచిది కాదని నమ్ముతారు. ఒకరి మాటలు చేతలపై ఆహారపు ప్రభావం చూపుతుందని, శాకాహారం మాత్రమే ఆధ్యాత్మికమైన సాధు గుణాలను పెంచుతుందని నమ్ముతారు. సాత్విక ఆహారం సాధనకు ప్రయోజనకరంగా ఉంటుంది. శాకాహారం మాత్రమే భక్తి లేదా ఆధ్యాత్మికత కాదని గ్రహించాలి. ప్రధానంగా మనసు దాని వైఖరి మీద ఆధ్యాత్మికత ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఆహారపు అలవాట్లు వాతావరణం భౌగోళిక స్వరూపం మత విశ్వాసాలను అనుసరించి ఉంటాయి. అలాంటి సమయం సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి.