గజవదన
సాహిత్యం
- గజవదన గణనాథ నాథ
- గౌరీవర తనయ గుణాలయా
- గజవదన గణనాథ నాథ
- విద్యా దాయక బుద్ధి ప్రదాయక
- సిద్ధి వినాయక హే శుభ దాయక
అర్థం
ఏనుగు ముఖం గల స్వామి! దేవతలకు ప్రభువు మరియు తల్లి గౌరి కి ప్రియమైన కుమారుడవు. నీవు అత్యంత దయగలవాడవు. నీవు ఐశ్వర్యం మరియు శుభములు కలిగించే వాడవు.
వివరణ
గజవదన గణనాథ నాథ | ఓ ఏనుగు ముఖం గల ప్రభూ! నీవు సకల జీవులకు అధిపతివి. |
---|---|
గౌరీవర తనయ గుణాలయా | తల్లి గౌరీ (పార్వతి) ప్రియ పుత్రుడా! నీవు సద్గుణాలు కలిగిన వాడవు |
గజవదన గణనాథ నాథ | ఓ ఏనుగు ముఖం గల ప్రభూ! నీవు సకల జీవులకు అధిపతివి. |
విద్యా దాయక బుద్ధి ప్రదాయక | ఓ ప్రభూ! నీవు విద్యాబుద్ధులనొసంగేవాడవు |
సిద్ధి వినాయక హే శుభ దాయక | ఓ ప్రభూ! నీవు మాకు విచక్షణ జ్ఞానం ప్రసాదించి, శుభాలను ప్రసాదించుము. |
రాగం: సోహిని (హిందుస్తానీ) / హంసానంది (కర్నాటిక్)
Sruthi: C# (Pancham)
Beat (Tala): Keherwa or Adi Taalam – 8 Beat
Indian Notation
Western Notation
https://archive.sssmediacentre.org/journals/vol_14/01JAN16/bhajan-tutor-Gajavadana-Gananatha-Natha.htm