ఇవ్వడం

Print Friendly, PDF & Email
ఇవ్వడం
పరస్పర సహకార శక్తి

(ఉపాధ్యాయుడు చుక్కల వద్ద పాజ్ చేస్తూ నెమ్మదిగా వ్యాయామాన్ని చదువుతాడు. మీరు అవసరమనుకుంటే, నేపథ్యంలో మృదువైన సంగీతాన్ని పెట్టుకొనవచ్చు).

దశ 1:

  1. సౌకర్యవంతమైన స్థితిలో కుర్చీ మీద కానీ, నేల మీద స్థిరాసనంలో కానీ కూర్చోండి.
  2. మీ వెన్నెముకను, తలను నిటారుగా ఉంచండి.
  3. మెల్లగా దీర్ఘశ్వాసను తీసుకుని, తిరిగి మెల్లగా బయటకు వదలండి.
  4. కొద్దిగా విశ్రాంతి తీసుకుని, దీర్ఘశ్వాసను మళ్లీ మళ్ళీ తీసుకోండి.

దశ 2:

  1. ఇప్పుడు మీ శరీరంలోని ఉద్రిక్తతలను తగ్గించండి.
  2. మీ కాలి వేళ్ళను సాగదీయండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి.
  3. మీ పిక్క కండరాలను బిగించండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి.
  4. మీ పై కాళ్లు మరియు తొడలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి.
  5. మీ పొట్ట భాగంలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి.
  6. మీ భుజాలను వెనక్కిలాగండి. వాటికి విశ్రాంతినివ్వండి. మీ భుజాలను పైకి క్రిందికి తట్టండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి.
  7. ఎడమవైపుకు చూడండి. ముందుకు చూడండి.కుడి వైపుకు చూడండి. మళ్ళీ ముందుకు చూడండి.
  8. మీ ముఖంలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి.
  9. ఇప్పుడు మీ శరీరం మొత్తం విశ్రాంతిని పొందినట్లుగా అనుభూతిని‌ పొందండి. అన్ని ఉద్రిక్తతలు తొలిగిపోతాయి.

దశ 3:

ఇప్పుడు గదిలో మీ గురించి మీరు తెలుసుకోండి. మీ ఆనందపు అనుభూతులను ఆ గది అంతా విస్తరించ నివ్వండి. ఆ ఆనందాన్ని మీ భవనము, మీరు ఉంటున్న పట్టణమంతా విస్తరింప చేస్తున్నట్లుగా భావించండి. మీ సంతోష ఆనందాలను ఈ భూమి అంతటా విస్తరింప చేయండి. ప్రతి ఒక్కరినీ మీ సోదరి లేదా సోదరుడిగా భావించండి. ప్రతి ఒక్కరిపై శ్రద్ధ వహించండి. మీరు ఎవరికైనా సహాయం చేసిన సమయ సందర్భాలను గురించి ఆలోచించండి. మీరు ప్రతిఫలాపేక్ష లేకుండా సహాయం చేసిన క్షణాలను గురించి ఆలోచించండి. అలా మరొక సమయ సందర్భాన్ని,మరింకొక సందర్భాన్ని గురించి ఆలోచించండి. నిస్వార్ధంగా సహాయపడినందుకు మిమ్మల్ని మీరు అభినందించుకోండి. భవిష్యత్తులో కూడా ఇలాంటి సహాయాలు చేయాలని నిర్ణయించుకుని, వాటిని ఎలా చేస్తారో ఆలోచించండి.

దశ 4:

ఇప్పుడు మీ దృష్టిని తరగతి గదికి తీసుకురండి, వ్యాయామం పూర్తయినందునది మీ కళ్ళను విప్పార్చి, మీపక్కన ఉన్న వ్యక్తిని చూసి నవ్వండి.

(శ్రీ సత్య సాయి మానవతా విలువల బోధన ఆధారంగా)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *