గురునానక్ జయంతి

Print Friendly, PDF & Email
గురునానక్ జయంతి

సిక్కు మత స్థాపకుడైన గురు నానక్ దేవ్ క్రీ.శ. 1469 లో లాహోర్ సమీపంలోని తల్వాండి గ్రామంలో కార్తీక మాసం లో జన్మించారు. (ఆంగ్ల మాసం ప్రకారము అక్టోబర్, నవంబర్). వీరి జన్మదినమును గురునానక్ జయంతి న జరుపుకుంటారు. గుర్పురబ్ (ముందురోజు )రోజు వేడుకలు “ప్రభాత్ పెరి సరే” పేరుతో తెల్లవారుజామున ఊరేగింపు, భజనలతో కూడిన వేడుకలు గురుద్వారాల వద్ద నుండి ప్రారంభమై ఊరంతా కొనసాగుతాయి. గురునానక్ జయంతి కి మూడు రోజుల ముందుగా సిక్కుల పవిత్ర గ్రంథం అయిన గురుగ్రంధ సాహిబ్ పారాయణాన్ని నిరంతరాయంగా పఠిస్తారు. (గురునానక్ జయంతి రోజు) గురుపర పర్వదినం రోజు పవిత్ర గ్రంథమైన గురుగ్రంధ సాహెబ్ ను పువ్వులతో అలంకరించి వారి పట్టణాలలో, గ్రామాలలో ఊరేగింపు చేస్తారు. ఐదుగురు సాయుధ దళ (పంజ్ పేయర్స్) నిషాన్ సాహెబ్ లు (సిక్కు జెండాలను) మోసే ఊరేగింపుకు నాయకత్వం వహిస్తారు. మధురమైన సంగీత వాయిద్యాలను వాయిస్తూ, గాయకులు శ్రావ్యంగా గానం చేస్తూ ఈ ఊరేగింపును చేస్తారు.

గురుద్వారాల స్వయంసేవకులు ప్రత్యేక సామూహిక భోజనాలు “లంగర్” ఏర్పాటు చేస్తారు. లింగ, కుల, వర్గ, మత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి భక్తిభావంతో, సేవాభావంతో వారి సంప్రదాయ గురుప్రసాదాన్ని అందించటమే వారి ముఖ్య ఉద్దేశ్యము.

ఈ పవిత్రమైన రోజు సిక్కులు గురుద్వారా లను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలలో వారి మత పరమైన కీర్తనలను పాడతారు. గురుద్వారా లోని ప్రతి ఒక్క గృహంలో ఈ ఉత్సవాలను ఎంతో ఉత్సాహంగా వేడుకగా జరుపుకుంటారు.

సందేశము:

ప్రేమ, ఐకమత్యం, సమానత్వం, సోదరభావం, ఆధ్యాత్మిక చింతన మొదలైన సందేశాలను తోటివారికి అందించాలన్న సందేశం అందించును.

[/vc_column_text][/vc_column][/vc_row]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *