హర హర శంకర
సాహిత్యం
- హర హర శంకర సాంబ సదాశివ ఈష మహేశ
- తాండవ ప్రియకరా చన్ద్రకలాధరా ఈషా మహేశా
- అంబ గుహా లంబోదర వన్దితా ఈషా మహేశా
- తుంగా హిమాచలా శృంగ నివాసితా ఈషా మహేశా
సాహిత్యం
భగవంతుని అనేక నామాలను శంకర, సాంబ సదాశివ , మహేశ అని జపించండీ. ఓ మహేశా! మీకు తాండవ నృత్యం (కాస్మిక్ డ్యాన్స్) అంటే చాలా ఇష్టం. మీ నుదుటిపై చంద్రుని అలంకరించుకున్నారు. గణేషుని చే పూజించబడ్డారు. మీరు హిమాలయాల నివాసి. మీ దివ్యనామాలను జపించడం ద్వారా చెడును నశింపజేసి రక్షణను ప్రసాదిస్తారు.
వివరణ
| హర హర శంకర సాంబ సదాశివ ఈష మహేశ | పరమేశ్వరా! నీవు నిత్య శుభప్రదుడు, సందేహాల నివృత్తి చేయువాడవు. ప్రకృతికి యజమాని, సకల శుభాలకు మూలం. |
|---|---|
| తాండవ ప్రియకరా చంద్రకళాధర ఈషా మహేశా | ఓ శివా! మీరు తాండవ నృత్యం చేస్తూ విశ్వం లో సమతుల్యత మరియు లయను అనుగ్రహిస్తారు. నెలవంకను శిరస్సున ధరించునది మీరే ఎప్పుడూ ప్రశాంతంగా, నిర్మలంగా ఉండి కాలాన్ని శాసించే గురువు మీరే! |
| అంబ గుహ లంబోదర వందిత ఈషా మహేశా | ఓ పరమ శివా! మాత పార్వతితో పాటు సుబ్రహ్మణ్యగణేశునిచే నీవు పూజింపపడుతున్నావు. సర్వశక్తిమంతుడైన ప్రభువు నీవే! |
| తుంగా హిమాచలా శృంగ నివాసితా ఈషా మహేశా | శివా వ! హిమాలయాలలె పవిత్రమైన, స్థిరమైన హృదయాలలో నివసించే వాడవు. మా హృదయ లోతులలో ఊహించదగిన నిశ్శబ్దం మీరు. |
Raga: Largely based on Darbari Kanada
Sruthi: C# (Pancham)
Beat (Tala): Keherwa or Adi Taalam – 8 Beat
Indian Notation


Western Notation


Adopted from : https://archive.sssmediacentre.org/journals/vol_12/01FEB14/Hara-Hara-Shankara-Samba-Sadashiva-Eesha-Mahesha-bhajan-tutor-february.htm

