అమరనాధ దర్శనము

Print Friendly, PDF & Email
అమరనాధ దర్శనము

ప్లేగువ్యాధి సంక్షోభము ఆదుపులోనికి వచ్చిన తరువాత స్వామి తన పాశ్చాత్యశిష్యులతో కలిసి నైనిటాల్, అల్మోరాలకు బయలుదేరెను. ఆ తరువాత కాశ్మీరుకు, అక్కడినుండి హిమవన్నగ శిఖరముపై నున్నఅమరనాధ దేవాలయమునకు పయనమై, 1898 అగష్టు రెంటవ తేదీన అచ్చటికి చేరెను. అమరనాథదేవాలయయాత్ర స్వామి వివేకానందుని ఆధ్యాత్మిక జీవితపధములో మరియొకమలుపు. అంతకు పూర్వము 1880లో శ్రీరామకృష్ణపరమహంసను దర్శించినప్పుడు, 1893లో విశ్వమత పరిషత్ వేదికమీద నిలిచినప్పుడు అతని జీవితములో కలిగినమలుపుల వంటిది అది కూడ. ఆ యాత్రలో వివేకానందుడు యాత్రక బృందములతో కలిసి, వారితోపాటు దేవాలయగుహకు ప్రక్కగా ప్రవహించు సెలయేటి మంచు నీటిలో స్నాన మాచరించి, కౌపీనమాత్ర ధారియై, శివాలయమున ప్రవే శించెను. భగవంతుని దర్శించువేళ అతని కొక అత్యద్భుతమైన అనుభవ విశేషము కలిగెను; మనసు మహదానందముతో పులకించి ఉప్పొంగి పోయెను; శాశ్వత హృదయానందస్థితి లభించెను. వివేకానందునికి శివుడు ఇష్టదైవము, ఆదేవుని అర్చించువేళ అతడుప్పొంగిపోవుచుండును. అంతే కాదు, కాశీవిశ్వేశ్వరుని వరప్రసాదు డతడు. అందువలన, అమంచుకొండ వేలుపైన శివుని దేవాలయమునందు ప్రవేశించినపు దాతడు అనందపార వశ్యమున మునుగుటలో ఆశ్చర్యము లేదు. ఆకరువాత కొన్నాళ్ళ వరకు అతనినోట శివనామముతప్ప మరియెకటి వినిపించెడిది కాదు. అహిమా లయపు మంచు పరిసరములలో ఎక్కడచూచినను పరమయోగియైన వరమే స్వరుడే ఆతని ధ్యాన దృషులయందు పసన్ను డగు చుండెడివాడు. ఆ తరువాత వివేకానందుడే ఇట్లు చెప్పినాడు. “నేను అమరనాధ దేవాలయమునందు అడుగిడిన క్షణమునందే, నాయందు శివుడు ప్రవేశించినాడు. ఆయన ఇక నన్ను వీడిపోడు.”

అమరనాధయాత్రానంతరము, శ్రీనగరసమీపము నందున్న క్షీర భవానీ మాత దేవాలయమును సందర్శించెను. అచ్చటకూడ అతడు మరువ లేని దివ్యానుభవమును పొందెను. మాతృశక్తి తనయందు నిండినిబిడ మైనట్లు అనుభవమును పొందెను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *