విలువను పట్టుకోండి
విలువను పట్టుకోండి
లక్ష్యము:
ఈ ఆట ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, లక్ష్య శుద్ది ని వృద్ధి చేస్తుంది. ఎన్ని అడ్డంకులు, కష్టాలు వచ్చినా విలువలను వదిలి పెట్టరాదని అంతర్గతంగా సూచిస్తుంది.
సంబంధిత విలువలు:
- ఏకాగ్రత
- అప్రమత్తత
- పట్టుదల
అవసరమైన వస్తువు:
- ఒకే సైజున్న 3 ప్లాస్టిక్ కప్పులు
- మానవతా విలువ రాసిన ఒక చిన్న బంతి ఉదా: సత్యము
- ఒక టేబుల్
గురువు ముందస్తు తయారీ:
లేదు
ఎలా ఆడాలి
- పిల్లలను 2 బృందాలు గా విభజించి ఆట గురించి చెప్పాలి.
- మొదటి బృందంలో ఒక బాబుని పిలిచి కప్పులు బోర్లించమనాలి. అందరూ చూసేలా బంతిని ఒక కప్పు కింద పెట్టాలి.
- ఆ విద్యార్థి పలు మార్లు అటూ ఇటూ తిప్పుతూ ఒక సారి మళ్ళీ వరుసలో ఉంచాలి.
- మరొక బృందం బంతి ఏ కప్పు కింద ఉందో కనిపెట్టాలి.
- ఆ బృందం లో ఎవరు కరెక్ట్ గా చెప్తే వాళ్లు విజేతలు.
- ఇలా ముందు గ్రూప్ వారు కూడా ఆడవచ్చు.
గురువులకు సూచనలు
- గురువులు ప్రహ్లాదుడు, Harischadrudu వంటి కధలు చెపుతూ వారు ఎన్ని కష్టాలు, అడ్డంకులు వచ్చినా వారు మంచివి అనుకున్న విలువలను పాటించారు అని చెప్పాలి!!