గుర్తింపు సమస్య

Print Friendly, PDF & Email
గుర్తింపు సమస్య
లక్ష్యం:

పిల్లలు యోగుల, గొప్ప వ్యక్తుల గురించి విని ప్రశ్నలకు సమాధానాలు చెప్పుట ద్వారా వారికి జ్ఞానం పెంపొందుతుంది.

సంబంధిత విలువలు:
  • ఏకాగ్రత
  • జ్ఞాపక శక్తి
  • అప్రమత్తత
కావాల్సిన సామాగ్రి:

ఏమీ లేదు

గురువు ముందస్తు తయారీ:

దేవతలు, యోగులు, గొప్ప నాయకుల పేర్లు కల అనేక చిన్న పేపర్స్ తయారు చెయ్యాలి.

ఎలా ఆడాలి
  1. తరగతిని రెండు బృందాలు గా విడగొట్టాలి.
  2. గ్రూప A కి ఒక స్లిప్ ఇవ్వాలి (ఉదా: వివేకానంద)
  3. గ్రూప్ అ లోని ఒక విద్యార్థి ఆ నాయకుని గురించి ఒక క్లూ ఇస్తారు.
  4. గ్రూవ్ B వారు తెలివిగా ప్రశ్నలడిగి పేరు కనుక్కోవాలి.
  5. ప్రశ్నలు అవును / కాదు అని సమాధానాలు ఉండాలి.
  6. ఒక ఉదాహరణ తో గురువు అతను వివరించాలి.
    • గ్రూప్ A – యోగి
    • గ్రూప్ B – జీవించి ఉన్నారా? లేదా? (ఈ ప్రశ్న నిబంధనల ప్రకారం అడగరాదు. గ్రూప్ A సమాధానం చెప్పదు)
    • గ్రూప్ B – జీవించి ఉన్నారా?
    • గ్రూప్ A – లేరు
    • గ్రూవ్ B – ఉత్తర భారత దేశానికి సంబంధించిన వారా?
    • గ్రూప్ A – అవును
    • గ్రూప్ B – మహిళా?
    • గ్రూప్ A – కాదు
    • గ్రూప్ B – విదేశాలకు వెళ్ళారా?
    • గ్రూప్ A – అవును
    • గ్రూప్ B – బెంగాల్ కు చెందిన వారా?
    • గ్రూప A – అవును
    • గ్రూప్ B – స్వామి వివేకానంద
    • గ్రూప్ A – అవును. కరెక్ట్ సమాధానం
  7. ఇలా గ్రూపులు మారుస్తూ ఆడవచ్చు.
  8. ఈసారి గ్రూపు B కి స్లిప్ ఇస్తే గ్రూప్ A పేరు కనుక్కుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *