సమగ్రత
సమగ్రత
కొత్త సవాళ్ళను సానుకూలంగాఎలా ఎదుర్కోవాలో తెలుసుకొనుటకు సమగ్రత
(పేరాగ్రాఫ్ లు మరియు పులిస్టాప్ ల మధ్య విరామం ఇవ్వండి)
దశ 1:
సౌకర్యం వంతమైన స్థితిలో కుర్చీ మీద కానీ లేదా నేల మీద స్థిరాసనంలో కూర్చోండి.
వెన్నెముకను, తలను నిటారుగా ఉంచండి. మెల్లగా దీర్ఘ శ్వాసను తీసుకుని, తిరిగి మెల్లగా బయటకు వదలండి. కొద్దిగా విశ్రాంతి తీసుకుని, దీర్ఘ శ్వాసను మళ్లీమళ్లీ తీసుకోండి.
దశ 2:
ఇప్పుడు శరీరంలోని ఉద్రిక్తతను తగ్గించండి. మీ కాలు వేళ్ళను సాగదీయండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి. పిక్క కండరాలను బిగించి, ఆపై వాటికి విశ్రాంతి ఇవ్వండి. ఆ తర్వాత మీ పైకాళ్లు మరియు తొడలలోని కండరాలను బిగించండి. ఆ తర్వాత వాటికి విశ్రాంతినివ్వండి. మీ కడుపు కండరాలను లాగండి. మళ్లీ వాటికి విశ్రాంతినివ్వండి. భుజాలను వెనక్కి లాగండి. మళ్లీ వాటికి విశ్రాంతినివ్వండి. మీ భుజాలను పైకి కిందికి తట్టండి. ఇప్పుడు మీ ఎడమ వైపు చూడండి. మళ్లీ ముందుకు చూడండి. తిరిగి కుడివైపు చూడండి. మళ్లీ ముందుకు చూడండి. ఇప్పుడు మీ ముఖం యొక్క కండరాలను బిగించండి. తిరిగి వాటికి విశ్రాంతినివ్వండి.మీ శరీరం మొత్తం విశ్రాంతి పొందినట్లుగా అనుభూతి పొందండి. అప్పుడు మీలోని ఉద్రిక్తతలన్నీ తగ్గిపోయి మీరు మంచి అనుభూతిని పొందుతారు.
దశ 3:
ఇప్పుడు మీరు మీ జీవితంలో చేసిన చర్యలు మరియు అన్ని కార్యకలాపాల ప్రతిఫలాన్ని పరిశీలించండి. మీరు మీ పట్ల నిజాయితీగా ఉన్నారా? లేదా? పరిశీలించండి. మీరు ఇతర వ్యక్తుల పట్ల నిజాయితీగా ఉన్నారా? లేదా? పరిశీలించండి.
మీ చేసే పనులు పర్యావరణానికి మంచివా? కాదా? పరిశీలించండి. మీరు అవి మంచివి అనే భావిస్తున్నారా? అవి పర్యావరణానికి సమతుల్యతను చేకూరుస్తున్నవని భావిస్తున్నారా?
అప్పుడు అవి కొనసాగించాలనుకుంటున్న కార్యక్రమాలేనా? అని పరిశీలించండి. అలాకాని యెడల మీకు, మీ చుట్టూ ఉన్నవారికి, మీ పర్యావరణానికి మరింత ప్రయోజకరమైన కార్య కలాపాలతో వాటిని భర్తీ చేయవచ్చా? మీ పట్ల, ఇతరుల పట్ల చిత్తశుద్ధితో వున్నచో మీరు మంచి అనుభూతిని పొందుతారని తెలుసుకోండి.
దశ 4:
ఇప్పుడు మీరు తిరిగి మీ దృష్టిని తరగతిగది లోనికి తీసుకురండి. మీ కళ్ళని విప్పార్చండి. వ్యాయామం పూర్తి అయినది కనుక మీ ప్రక్కన ఉన్న వారిని చూచి నవ్వండి.
[శ్రీ సత్య సాయి మానవతా విలువల విద్యా బోధన ఆధారంగా]