భాషలు
భాషలు
భాషా పరంగా ప్రపంచంలో అనేక ధనిక దేశాల్లో భారత దేశం ఒకటి. భారత ప్రభుత్వం 14 భాషలను అధికారికంగా గుర్తించింది. వాటిలో ప్రతి దానికీ స్వంత చరిత్ర ఉంది. గ్రీకు లేదా లాటిన్ బాషల కన్నా ప్రాచీనమైన సంస్కృతం భాష అన్ని భాషలకు మాతృ భాష. భారత దేశంలో అన్ని శాస్త్రీయ సాహిత్యాలు సంస్కృత భాషలోనే రాశారు. దాని నుండి బెంగాలీ గుజరాతీ హిందీ మరాఠీ భాషలు వచ్చాయి వీటిని ఆర్యన్ భాషలు అని అంటారు. దక్షిణ భారతదేశంలో మాట్లాడే తమిళ తెలుగు కన్నడ మళయాళ భాషలను ద్రావిడ భాషలు అంటారు తమ భాష సంస్కృతం అంతటి ప్రాచీనమైనదని తమిళ పండితులు చెబుతారు. ద్రావిడ భాషలు నేరుగా సంస్కృతం నుంచి రాకపోయినా వాటి మీద సంస్కృత ప్రభావం ఎక్కువగానే ఉంది.
అన్ని భాషలు గొప్ప తనంలో సమానమైనవి. ఒక్కొక్క భాషను కొన్ని మిలియన్ల మంది మాట్లాడుతారు. స్వంత భాష పైనే మోజు పెంచుకుంటే ప్రమాదకరం. ఒకరి స్వంత భాష పైన వ్యామోహం మతోన్మాదం భాషా విభేదాలకు దారి తీస్తుంది. ఇది భాషా పరంగా పోటీలకు దారి తీస్తుంది. దీని అంతిమ ఫలితం అనైక్యత, గందరగోళం. మన పిల్లల్ని వీలైనన్ని ఎక్కువ భారతీయ భాషలు నేర్చుకునేందుకు ప్రోత్సహించాలి. ఒకటి రెండు ఇతర భాషలు నేర్చుకోవడం మనల్ని సుసంపన్నం చేస్తుంది. సామాజికంగా రాజకీయంగా ఉపయోగకరం. భాషా బేధాలు కోపగించుకొనేవి కాదు అవి గర్వించదగ్గ గొప్ప వారసత్వం బాబా చెప్పినట్లు ఉన్నది ఒక్కటే భాష అది హృదయ భాష. దయగల హృదయం దైవ మందిరం ఎవరితో నైనా సత్సంబంధాలు నెలకొల్పగలదు.