మాణిక్ వాచగర్
మాణిక్ వాచగర్
జననం & ప్రారంభ జీవిథం
మాణిక్ వాచగర్ ఒక భక్తిపరులైన బ్రాహ్మణ కుటుంబంలో శాంభుపద శిరుదర్ మరియు శివజ్ఙానవతి దంపతులకు తిరువడవూర్ అనే గ్రామంలో జన్మించారు. ఇది మధురైకి ఏదు మైళ్ళ దూరంలో వైగై నదీ తీరాన ఉంది. ఆయన అసలు పేరు వడవూరాన్. చిన్నప్పటి నుంచి అద్భుతమైన మేధావిగా పెరిగిన ఆయన పదహారేళ్ల వయస్సులోనే అనేక శాస్త్రాలు, కళలు మరియు ధార్మిక గ్రంథాలను అభ్యసించారు.

వడవూరార్ మాణిక్ వాచగరుడిగా మారిన విధానం
వడవూరార్ బుధ్ధి, నిజాయితీని గమనించిన పాండ్య రాజు అరిమర్థనన్ (ఇతను మధురై వరగుణ పాండ్యన్ అని ప్రసిద్ధుడు) ఆయనను మంత్రిగా నియమించి “తెన్నవన్ బ్రహ్మరాయన్” అనే బిరుదు ప్రదానం చేశారు. దీని అర్థం బ్రాహ్మణులలో నాయకుడు అని. ఆయన ప్రజలను, రాజ్యాన్ని మరియు భుమిని నీతివంతమైన మార్గంలో ధార్మిక పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించారు. అయితే ఆయన మనస్సు అంతా ఆ దేవదేవుడైన పరమేశ్వరుడి పైననే స్థిరంగా ఉండేది. ఆయన తనకు ముక్తి మార్గం చూపగల గురువు కోసం ఆతురతతో ఎదురు చూస్తూ ఉండేవారు.
రాజు మంత్రివర్యులైన తిరువడవూరార్‍ను భారీ మొత్తంలో ధనంతో చోళ రాజ్యానికి గుర్రాలు కొనుగోలు చేయాలని పంపించాడు. ఇదే వడవూరార్ జీవితంలో మలుపు తిరిగిన ముఖ్యమైన ఘట్టం. ప్రయాణంలో వడవూరార్ తిరుప్పెరుంటురై (అవుదయ్యార్ కోయల్) చేరుకున్నాడు. అక్కడ ఆయన ఓ వృక్షం క్రింద శిష్యులకు సత్యాన్ని బోధిస్తున్న గురువు నందు శివుని దర్శించారు. లోక గురువు దర్శనం వడవూరార్‍ను తాను ఎవరో మరిచేలా చేసి, ఆ గురువు పాదాల వద్ద శరణు పొందేలా చేసింది. అప్పటి నుండి ఆయన ఆ గురువు శిష్యుడయ్యాడు. ఆ గురువుగా వేషధారణ చేసి వచ్చిన పరమేశ్వరుడు ఆయనకు “మాణిక్ వాచగర్” అనే నామధేయం ఇచ్చారు. దాని అర్థం “అతని మాటలు విలువైన మాణిక్యాల వంటివి” అని. గురువును కలిసిన తరువాతే ఆయన అనేక కవితలు రచించడం ప్రారంభించాడు.

తన గురువు ఆజ్ఙతో మాణిక్ వాచగర్, రాజు గుర్రాల కోరకు ఇచ్చిన ధనంతో తిరుప్పెరుందురైలో ఒక అద్భుతమైన ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఇదిలా ఉండగా, రాజు వడవూరార్‍కు సందేశం పంపించి, గుర్రాలతో వెంటనే రావాలని ఆదేశించాడు. మాణిక్ వాచగర్ తిరుప్పెరుందురై నాథుడైన శివుడిని ప్రార్థించి, “అవని మూలం” రోజున గుర్రాలు రాజుకు అందిచబడతాయని హామీ పొందాడు. ఆ విషయాన్ని మాణిక్ వాచగర్ రాజుకు తెలియజేసి నమ్మించాడు.
ఆ సమయంలో శివుడు అరణ్యంలో ఉన్న అన్ని నక్కలను గుర్రాలుగా మార్చి, అవే రాజుకు అప్పగించాడు. అదే రాత్రి ఆ గుర్రాలు తిరిగి నక్కలుగా మారిపోయి రాజ్యంలో అంతటా పరుగులు తీశాయి. కోపంతో ఉప్పొంగివ రాజు, మాణిక్ వాచగర్‍ను శిక్షించమని సైనికులను ఆదేశించాడు. అతడిని వైగై నదిలోని వేడి మట్టిపై ఒక బండరాయితో నిలబెట్టి శిక్షించమన్నాడు.
ఆ సమయంలో భక్తసులభుడైన శివుడు, తన భక్తుడిని రక్షించేందుకు వైగై నదిలో పెద్ద వరద ప్రవహింపజేశాడు. ఈ లీల ద్వారా మాణిక్ వాచగర్ మహిమనుతెలుసుకున్న రాజు, వెంటనే ఆయనను విడుదల చేసి క్షమాపణలు కోరాడు. ప్రేమమూర్తియైన మాణిక్ వాచగర్ రాజును క్షమించి, మంత్రి పదవిని వదిలివేశాడు.
ఇతడు భగవంతుని మహిమను గానం చేస్తూ, భక్తితో తన యాత్రను ప్రారంభించాడు. చివరికి ఆయన చిదంబరానికి చేరాడు. తన ప్రయాణం అంతా ఆయన తిరువాసగాన్ని గానం చేశాడు. కాని అది రాయబడినది మరియు సంరక్షించబడినది ఒక్క చిదంబరంలోనే శివుదు బ్రాహ్మణ రూపంలో ప్రత్యక్షమై రాసినప్పుడు. ఆ బ్రాహ్మణుడు తిరువాసగాన్ని తాళపత్రాలపై రాయడం ముగించి, తిరుచిత్రంబలం ఆలయపు మెట్ల దగ్గర వాటిని ఉంచి అదృశ్యమయ్యాడు. మాణిక్ వాచగర్ ఆ బ్రాహ్మణ రూపంలో వచ్చినవాడు తన దేవుడే అని గుర్తించినప్పుడు, ఆయన ఆలయంలో ప్రభవించిన వెలుగులో ఒక్కటైపోయాడు.
మాణిక్ వాచగర్ తమిళ శైవ సంప్రదాయంలోని నలుగురు గొప్ప స్వాములలో ఒకరు. అప్పర్, సుందరర్, సంబంధర్ మరియు మాణిక్ వాచగర్‍ను “తమిళలో నలుగురు స్వాములు” అని పిలుస్తారు. కొన్ని శతాబ్దాల పాటు జైనమతం మరియు బౌద్ధ మతం ప్రభావంలో ఉండిన తర్వాత, ఈ నలుగురు తమిళనాడులో శైవమతాన్ని పునరుద్ధరించారు. ఆయన రచించిన కొన్ని ప్రముఖ కృతులు తిరువెంబావై, తిరువాసగం, తిరుప్పల్లియెళుచి మొదలైనవి.

