మనోజవం శ్లోకము – ఆక్టివిటీ

Print Friendly, PDF & Email
మనోజవం శ్లోకము – ఆక్టివిటీ

లక్ష్యం – భగవంతుని నామస్మరణ ప్రాముఖ్యత మరియు నామాన్ని స్మరించటం వల్ల కష్టమైన పనులు సులువుగా సాధించవచ్చని గ్రూప్-1 పిల్లలకు అర్థమయ్యేటట్లు చెప్పడం. అంతేకాకుండా నామస్మరణ మనల్ని అన్ని విధాలా కాపాడుతుందని తెలియపరచడం.

అవసరమైన వస్తువులు – పూసలు, పూసలని చుట్టడానికి ఒక తీగ, కత్తెర

జపమాల తయారు చేసే ఆక్టివిటీ

హనుమంతుడు రామ నామం తో అతి కష్టమైన పనులను ఎలా సాధించాడో గురువులు పిల్లలకు చెప్పాలి. భగవంతుని నామస్మరణ చేస్తూ ఏదైనా పని చేస్తే, ఆ పనికి కావలసిన ధైర్యం, పట్టుదల మరియు తెలివితేటలు భగవంతుడు మనకి ప్రసాదించి ఆత్మవిశ్వాసంతో ఆ పనిని పూర్తి చెయ్యడానికి సహకరిస్తాడని పిల్లలకు తెలియపరచాలి.

  1. మొదట ప్రతి విద్యార్థికి 27 పూసలు (అందులో 26 సాధారణ పూసలు మరియు రంగులో కాని లేదా పరిమాణంలో కానీ వేరేగా కనబడే ఒక గురుపూస ఉండేట్లు చూసుకోండి) మరియు ఒక తీగ ఇవ్వండి.
  2. చదునుగా మరియు శుభ్రంగా ఉన్న స్థలంలో ఆ 27 పూసలను పెట్టమని చెప్పండి.
  3. తీగ చివర ముడి వేశాక విద్యార్థులను ఒక్కొక్క పూస తీసుకుని అ తీగకి జోడించమని చెప్పండి.
  4. ప్రతి పూస జోడించే సమయంలో జైశ్రీరామ్ మంత్రమును జపించాలి.
  5. విద్యార్థులు 26 పూసలు జోడించిన తరువాత, గురు పూస జోడించడానికి మరియు కుచ్చు వేయడానికి గురువులు సహాయం చేయవలెను.

చర్చించవలసిన విషయములు
  1. ఈ యాక్టివిటీ నచ్చినదా లేదా?
  2. ఈ జపమాల శక్తివంతమైనదా కాదా? అయినచో దానికి కారణం ఏమిటి?
  3. ఏదైనా పనిని దైవ నామస్మరణ చేస్తూ చేసిన ఎడల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఈ యాక్టివిటీ చేసినంత సేపు అందరి దృష్టి భగవన్నామస్మరణ మీద ఉండాలి. క్లాస్ అయిపోయాక ఆ జపమాలను వారికే ఇచ్చి పూజామందిరంలో పెట్టుకోమని చెప్పాలి. ప్రతిరోజు ఆ జపమాలను ఉపయోగించి వారికిష్టమైన నామము (గాయత్రి మంత్రం, ఓం నమశ్శివాయ, ఓం శ్రీ సాయిరాం) 27 సార్లు జపించమని చెప్పండి. ఏదైనా ప్రత్యేక సందర్భాలలో, ఉదాహరణకి, గణేష్ చతుర్థి రోజున, శ్రీ గణేశాయ నమః అని 108 సార్లు ఉచ్చరించమని(27*4) చెప్పండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *