తల్లి ప్రేమ

Print Friendly, PDF & Email

తల్లి ప్రేమ

చక్కగా కుదురుగా కూర్చోండి.నిన్ను నీవు
తెల్లగా మెరుస్తున్న మెట్ల వరసపై ఉన్నట్లుగా ఊహించండి. నీవు ఒక్కొక్కటిగా మెట్ల వరుసలో దిగుతున్నావు. (10 9 8 7 6…. 1 అలా..)

అక్కడ ఒక పెద్ద తలుపు కనిపించింది. అది చాలా బాగా మెరుస్తున్న ది.

ఆ తలుపు వెనకాల ఏమున్నదో అని నీకు చాలా చాలా కుతూహలంగా ఉన్నది. ఏం చూసావు?…మీ అమ్మని!

అబ్బ! అమ్మని చూసి చాలా సంతోషించావు. ఆమె చాలా అందంగా ఉన్నది. నీవు ఆమె వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి గట్టిగా కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నావు.

అమ్మా! నిన్ను నేను ఎంతో ఎంతగానో ప్రేమిస్తున్నాను అని చెప్పావు. అమ్మ కూడా నవ్వుతూ నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను నాన్న.. ఎప్పటికీ ప్రేమిస్తాను..అని చెప్పింది. నిన్ను చేతుల్లోకి తీసుకొని ఒక పాట పాడింది.

(మీ అమ్మ పాడే పాటను గుర్తుకు తెచ్చుకోండి ) మీ ఇరువురి మధ్య ప్రేమ ప్రవాహం కొనసాగింది.. నిన్ను నేను ఎప్పటికీ విడిచి వెళ్ళనమ్మా! అని నీవు అమ్మతో చెప్పావు. అమ్మ నీ వేలు పట్టుకుని తలుపు దగ్గరికి తీసుకెళ్ళింది.

మనం మళ్ళీ మన ఇంట్లో కలుసుకుందాం..దయ కలిగి సంతోషం గా ఉండు!…అని నవ్వుతూ చెప్పింది.

నీవు తలుపు బయటకు వచ్చి మెట్లు ఎక్కడం ప్రారంభించావు..(1,2,3.…….10)

Welcome back!

ప్రశ్నలు:
  1. నీకు ఎలా అనిపించింది?
  2. మీ అమ్మ ఎలా ఉంది?
  3. నీవు ఆమెను ప్రేమించావా?
  4. ఏ రోజైనా అమ్మను వదిలేస్తావా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: