నరసింహ మెహతా
నరసింహ మెహతా
నరసింహ మెహతా గుజరాతు రాష్ట్రంలోని భావ నగరు సమీపంలోని తలాజా గ్రామంలో జన్మించాడు. చిన్న వయస్సులోనే అతనికి మాతా పితృ వియోగం కలిగింది.
అన్న వదినల పెంపకంలో పెరిగాడు. ఒకనాడు వదిన గారు అతనితో పరుషంగా మాట్లాడింది. అది అతను సహించలేక పోయాడు.
ఎవ్వరికీ చెప్పక ఇల్లు వదిలి అడలో ఉన్న శివాలయంలో ఏడు రోజులు ఉపవాసం చేసి దీక్షగా భగవంతుని ప్రార్ధించాడు. శివుడు తన భక్తికి, తపస్సుకు మెచ్చాడని తన రచనల్లో వ్రాసుకున్నాడు.
శివుడు ప్రత్యక్షమై వరము కోరుకో మన్నాడు. “స్వామీ ! నాకు ఏది మంచిదో అది మీరే ఇవ్వండి” అన్నాడు నరసీ మెహతా. శివుడు నరసింహకు ద్వారకలో శ్రీకృష్ణుని రాసక్రీడలు చూపించాడు.
ద్వారకలో నరసీ మూడు నెలలు ఉన్నారు. కృష్ణ భగవానుడు ఆయనకు పూలు చేతికిచ్చి పద్యాలు వ్రాయమన్నాడు.
తిరిగి వచ్చిన నరసింహను అన్నా వదినె అప్యాయతతో ఆహ్వానించారు. ఇప్పటినుండి నరసింహ జీవిత సరళి మారింది, హరిచింతనము, హరినామస్మరణ, అతని దిన చర్య అయింది.ఎందరో భక్తులు, దూరప్రాంతాలనుండి గూడా వచ్చి ఆయన వద్ద చేరారు. ఆ సమయంలో నరసింహ జునాఘడు వెళ్ళి అక్కడ స్థిరనివాసము ఏర్పరుచుకున్నారు.
ఆయన జీవితంలో కొన్ని సంఘటనలు నరసింహ మెహతాకు శ్రీకృష్ణుని ఎడ భక్తి విశ్వాసాలకు ఋజువు చేస్తాయి,
మామెరా సంఘటనలో సలసల కాగే నీళ్ళను ఆను నేను స్నానానికి ఇచ్చారు. నరసీ ‘ఎల్హర్’ రాగం ఆలమ్ చాడు. వెంటనే దేవుడు చల్లటి వానజల్లులు కురిపించారు. నసీ వ్రాశాడు.“నా కోడళ్ళు మరిగే నీళ్ళతో స్నానం చేయ మని నన్ను హేళన చేశారు. ప్రభూ, వానజల్లు కురిపించి నీ సేవకుడి గౌరవాన్ని కాపాడావు”.
ఒకసారి ద్వారకలో, కొందరు యాత్రికులకు రూ.700లు చెల్లించడంకోసం దేవుడు ‘సమాల్షా శేఠ్’ రూపం ధరించాడు. ఆ యాత్రికులు అంతకుముందు ఆ సొమ్ము జునాఘడ్ లో ఇచ్చిఉన్నారు.
‘హారం’ సంఘటన ఇంకా విచిత్రంగా ఉంది. రాము. డీలక మహారాజు నరసింహను ఖైదు చేసి, ‘భగవంతుడు ఖైరు లోకి వచ్చి నీకు హారం వేస్తే నిన్ను విడుదల చేస్తాను. తెల్లవారే లోపల ఇది జరగకపోతే నిన్ను ఉరి తీస్తాను” అన్నాడు.
రాత్రంతా మెహతా భక్తి సంకీర్తనం చేస్తూనే ఉన్నాడు. అప్పుడు మొదట భగవంతుని వేడుకున్నాడు. ఎంతకూ ఫలితం లేక పోతే “ప్రభూ! నా కర్మ అని నన్ను వదిలివేయవద్దు. నీకు ‘పతకి పావనుడు’ అనేబిరుదు ఏవిధంగా తగిఉంటుంది? నన్ను ఇప్పుడు వదిలివేశావా అందరు నిన్నే గేలి చేస్తారు” అన్నాడు…
ఇంకా దేవుడు పలికే సూచనలు కనుపించలేదు. “ఒక చిన్న హారం వేస్తే నీకు ఎంతో పేరు వస్తుంది. కాని నీ భక్తుణ్ణి ఆపదలో ఆదుకోకపోతే, ఇంక నిన్నెవరు కీర్తించారు. నాకు చావంటే భయంలేదు. నీకు వచ్చే చెడ్డ పేరు గురించే నేను బాధపడ్తున్నాను”. చివరకు భగవంతుడు మెహతా పిలుపు అందుకున్నారు. ఆకాశంలోనుండి ఒక హారం వచ్చి మెహతా మెడలో పడింది.
ఇటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి మెహతా జీవితంలో, నరసీ మెహతా గొప్ప భక్తుడేకాడు, పరమ జ్ఞాని కూడా, ఆయన అద్వైతాన్ని విశ్వసించాడు. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఎన్నో పఠించాడు. భక్తిపారవశ్యంలో తన శరీర పోషణను గూడ మరిచేవాడు. ఆకలి, దప్పిక, దుఃఖము, సంతోషము ఆయన్ని బాధించేవికావు. ఆయన ఆధ్యాత్మిక మార్గానికి ఎట్టి అవరోధాలు ఉండేవి దు. భగ వంతునికే సర్వం అర్పించాడు. సంపూర్ణ శరణాగతి పొందారు.
మెహతా తోటివారిఎడ ప్రేమ, సానుభూతి కలిగి ఉండేవాడు. మానవులందరి ఆధ్యాత్మిక ఉన్నతికి పాల్పడడమే తన ధ్యేయంగా పెట్టుకున్నాడు దానికై తన పద్య కవితద్వారా ఎంతో కృషి చేశాడు.
ప్రశ్నలు:
- నరసింహ మెహతా భక్తి ఎట్లు నిరూపింపబడింది?
- అతని జీవిత ధ్యేయమేది?
[Illustrations by A. Priyadarshini, Sri Sathya Sai Balvikas Student.]
[Source: Stories for Children II, Published by Sri Sathya Sai Books & Publications, PN]