చిత్ర కళ (పెయింటింగ్)
చిత్ర కళ (పెయింటింగ్)
మనకు తెలిసిన మొదటి చిత్రకళలో ఔరంగాబాద్ లోని అజంతా గుహల కుడ్య చిత్రాలు. తెలియని భౌద్ధ కళాకారులచే చిత్రించారు. ప్రాచీన భారతదేశంలో చిత్రకళ ఎంతగా అభివృద్ధి చెందిందో తెలుపుతుంది. పురాతన కాలం నాటి చిత్ర కళ పాఠశాలలో కాంగ్రా వ్యాలీ మరియు రాజస్థానీ ఉన్నాయి. మొఘల్ చక్రవర్తులు సంగీతంలో హిందుస్థానీ ప్రవేశ పెట్టిన విధంగా చిత్ర లేఖనంలో పర్షియన్ ఆలోచనలు తెచ్చారు. బౌద్ధ హిందూ ముస్లిం మొఘల్ పాఠశాలలు కళాకారులపై లోతైన మత ప్రభావం చూపించాయి.
ప్రజలు వివిధ మతపరమైన వేడుకలు అభ్యాసాలు కలిగి ఉండవచ్చు. కానీ భారతదేశంలో వివిధ మతాలు ఒకే విషయాన్ని ప్రకటించాయి అది దేవుడు ఒక్కడే. మనం హిందూ దేవాలయాలు ముస్లిం మసీదులు జైన దేవాలయాలు సిక్కు గురుద్వారాలు చూసినప్పుడు భగవంతునిపై విశ్వాసం కలుగుతుంది ఇది దైవ ప్రేరితమైన కళ. ఇది హిందూ క్రిస్టియన్ ముస్లిం తేడా లేకుండా ఒకే విషయాన్ని చెబుతుంది అది ‘దేవుడు ఒక్కడే’