అరచేతి ఆట
అరచేతి ఆట
లక్ష్యము:
సరదాగా, ఉత్సాహంతో ఆడే ఆట సంబంధిత విలువ.
సంబంధిత విలువలు:
- ఆత్మ గౌరవం
- ఇతరులలో మంచిని చూచుట
అవసరమైన వస్తువులు:
ఒక పేపర్, పెన్సిల్ ప్రతి ఒక్కరికీ
గురువు ముందస్తు తయారీ:
అక్కర్లేదు
ఎలా ఆడాలి
- పిల్లలను వృత్తకారం లో కూర్చోమని గురువు చెప్పాలి.
- ప్రతి విద్యార్థి తన పేరు రాసి అరచేతి ని పేపర్ పై పెట్టి అంచులు గీసి పక్కవాడికి ఇవ్వాలి.
- ఆ పిల్లవాడు ఆ చేతి బొమ్మ బాలుని గురించిన మంచి గుణం ఒకటి రాసి పక్కవాడికి ఇవ్వాలి. క్లాస్ లోని మిగిలిన పిల్లలు కూడా ఆ పేపర్ మీద ఆ బాబు మంచి గుణం ఒక్కొక్కటి రాయాలి.
- చివర్లో అందరి పేపర్స్ లో రాసిన మంచి గుణాలు చదవ వచ్చు.