సహనము మరియు స్వీయ క్రమశిక్షణ

Print Friendly, PDF & Email
సహనము మరియు స్వీయ క్రమశిక్షణ

దశ 1 :

  1. సౌకర్యవంతమైన స్థితిలో కుర్చీ మీద కానీ, నేల మీద స్థిరాసనంలో కానీ కూర్చోండి.
  2. మీ వెన్నెముకను, తలను నిటారుగా ఉంచండి.
  3. మెల్లగా దీర్ఘశ్వాసను తీసుకుని, తిరిగి మెల్లగా బయటకు వదలండి.
  4. కొద్దిగా విశ్రాంతి తీసుకుని, దీర్ఘశ్వాసను మళ్లీ మళ్ళీ తీసుకోండి.

దశ 2 :

ఇప్పుడు మీ శరీరంలోని ఉద్రేకాలను తగ్గించండి. మీ కాలి వేళ్ళని సాగదీయండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి. మీ పిక్క కండరాలను బిగించండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి.

మీ పై కాళ్లు మరియు తొడలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి.

మీ పొట్ట భాగంలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి. మీ భుజాలను వెనక్కిలాగండి. వాటికి విశ్రాంతినివ్వండి. మీ భుజాలను పైకి క్రిందికి తట్టండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి. ఎడమవైపుకు చూడండి. ముందుకు తిరిగి కుడి వైపుకు చూడండి. ముందుకు చూడండి. మీ ముఖంలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి. ఇప్పుడు మీ శరీరం మొత్తం విశ్రాంతిని పొందినట్లుగా అనుభూతిని‌ పొందండి. ఉద్రేకాలు అన్నీ తొలిగిపోతాయి.

దశ 3:

మిమ్మల్ని మీరు ఒక రబ్బర్ బంతిలా భావించండి. మీరు ఒక దృఢమైన రబ్బరు కోటు రక్షణలో ఉన్నారు. మీ అంతరంగంలో ఎంతో ప్రశాంతతను పొందుతున్నారు. ఒక్క నిమిషము మీరు ఎంత ప్రశాంతంగా ఉన్నారో గమనించండి. ఈ ప్రశాంతమైన అనుభూతి నుండి మిమ్మల్ని అడ్డుకోవటానికి ఏదీ లోపలికి ప్రవేశించదు అని భావించండి. అది రబ్బరు పూత పైననే ఎగిరిపోతుంది. ఆ ప్రశాంత అనుభూతులతో ఒకటి లేదా రెండు నిమిషములు విశ్రాంతి తీసుకోండి. భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా తొందరపడితే నట్లయితే, అప్పుడు మీలోని ప్రశాంతతను గుర్తుంచుకోగలరు. మీరు ఎల్లప్పుడూ మీలోని ప్రశాంతతను కనుగొనగలరు అని తెలుసుకోండి.

దశ 4:

ఇప్పుడు దృష్టిని తిరిగి తరగతి గదికి తీసుకుని రండి. వ్యాయామం పూర్తి అయినది కనుక మీ కళ్ళను తెరిచి విప్పార్చండి. మీ పక్కన ఉన్న వారిని చూసి నవ్వండి.

కూర్చుని చేసే ఈ వ్యాయామం యొక్క అనుభవాలను విద్యార్థులు పక్కవారితో పంచుకోవాలని అనుకోవచ్చు కనుక వారిని ప్రోత్సహించండి.ఈ వ్యాయామం వలన వారు ఎటువంటి అనుభూతిని పొందారో అడగండి. ఆ అనుభూతిని చిత్రంగా గీయమని ప్రోత్సహించడం వల్ల పిల్లలలో సృజనాత్మకత పెంపొందుతుంది.

[శ్రీ సత్యసాయి మానవతా విలువల బోధని ఆధారంగా.]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *