సహనము మరియు పట్టుదల

Print Friendly, PDF & Email
సహనము మరియు పట్టుదల
ఉపాధ్యాయుడు ఇస్తున్న సూచనలను అనుసరించండి…. 
పారే నీటి సవ్వడి, ప్రకృతి ధ్వనులు,నీటిలో తిమింగలములు నీటిలో చేయు ధ్వనులు మరియు ఇంపైన సంగీతమును వినండి.

(మీకు అవసరమైతే) నేపథ్యంలో మృదువైన సంగీతాన్ని వినటానికి పెట్టండి.

సుఖాసనంలో కుర్చీలోకానీ లేదా నేల మీద స్థిరాసనంలో కానీ కూర్చోండి.

వెన్నెముకను,తలను నిటారుగా ఉంచండి.

మెల్లగా దీర్ఘ శ్వాసను తీసుకుని, తిరిగి మెల్లగా బయటకు వదలండి.

కళ్ళు మూసుకోండి. మీకు అలా అసౌకర్యంగా వుంటే నేలవైపు చూడండి.

మళ్లీ దీర్ఘ శ్వాస తీసుకోండి.

మీకు ఇష్టమైనటువంటి తీపి పదార్థం గురించి ఆలోచించండి.

ఈ ఇష్టమైన తీపి పదార్థాన్ని ఎవరైనా ఇస్తున్నట్టుగా ఊహించుకోండి.

దాని వాసన ఎంత బాగుంది.

దాని రంగు కూడా ఎంత బాగుంది.

అయితే అది ఇప్పుడు తినకండి.

మీరు తినడానికి మరో వారం వరకు వేచి వుంటే, మీకు మరో రెండు ఇవ్వగలరు.

మరి నీవు ఏం చేస్తావు?

ఉన్న ఒకటి తింటావా? లేదా వేచియుండి మూడు తింటావా?

వేచి వుండాలని నిర్ణయించుకుంటావు.

వేచియున్నందుకు మీ వీపుపై మీరు తట్టుకోండి.

ఇప్పుడు నేను చిన్నగా చేసే గంటల శబ్దం తో నెమ్మదిగా కళ్ళు తెరిచి, మీ పక్క కూర్చున్న వారిని చూసి నవ్వండి.

చర్చ:
  1. నీవు ఆ తీపి పదార్థాన్ని వెంటనే తింటావా? లేదా వేచి ఉంటావా? ఎందుకు?
  2. మీరు దానిని వెంటనే దానిని తిన్నట్లయితే, వారం చివరిలో మీరు మూడు తినినప్పుడు మీరు ఎలాంటి అనుభూతిని పొందుతారు?

[సత్య సాయి మానవతా విలువల విద్యా బోధన ఆధారంగా – చక్కని నడత మరియు భావోద్వేగ అక్షరాస్యత అభివృద్ధి కొరకు పాఠ్య ప్రణాళిక -కరోలే ఆల్డర్మాన్]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: