నమస్తేస్తు శ్లోకము – ఆక్టివిటీ
నమస్తేస్తు శ్లోకము – గులకరాళ్లు లేదా నాణేలు
లక్ష్యం
లక్ష్మీదేవి చేతిలో ఉన్న చక్రం సమయాన్ని, శంఖం ధ్వనిని, మరియు గధ శక్తిని సూచిస్తాయని గ్రూప్-1 పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడం మరియు మనం వీటిలో దేనినీ వృధా చేయకూడదు అని తెలుసుకోవడం.
అవసరమైన వస్తువులు
గులకరాళ్లు లేదా నాణేలు, ఒక పాత్ర.
- గురువు మధ్యలో కూర్చుని పిల్లలను చుట్టూరా కూర్చోబెట్టాలి. పిల్లల ముఖం గురువు వైపు కాకుండా బయటకు చూచేటట్లు కూర్చోమనాలి.
- పిల్లలను కళ్ళు మూసుకొని జాగ్రత్తగా వినమని చెప్పాలి.
- గురువు రాళ్ళను ఒక్కొక్కటిగా పాత్రలో వేయాలి.
- పిల్లలకి గురువు ఎన్ని రాళ్లు వేశారో లెక్క వేయమని చెప్పాలి.
- మొదట పిల్లలందరూ కలిసి పెద్దగా లెక్కించవచ్చు.
- తరువాత పిల్లలను నిశ్శబ్దంగా మనసులోనే లెక్కించమని అడగండి. గురువు కొన్ని రాళ్ళను చాలా దగ్గరి నుండి నిదానంగా వేయాలి.
- పిల్లల శ్రవణ మరియు ఏకాగ్రత పెరిగేకొద్దీ గురువు ఎక్కువ రాళ్లు వేయాలి మరియు వేగంగా వేయాలి. రెండు మూడు ఒకేసారి వేయొచ్చు కూడా.
- పిల్లలు ఒకరితో ఒకరు పోటీ పడటం లేదని మరియు వారికి వారే పోటీ అని గుర్తు చేయండి.
క్లాసులో చర్చించవలసిన విషయాలు:
- ఈ ఆట మీకు నచ్చిందా? అయితే ఎందుకు?
- అసలు పిల్లలకు లెక్క వేరు వేరుగా ఎందుకు వచ్చింది?
- మాట్లాడడం మానేసి ఏకాగ్రతతో ఉన్నప్పుడు ఏమి జరిగింది? అసలు ఏకాగ్రతతో ఉండడం కష్టమా?
- ఏకాగ్రతకి నిశ్శబ్దం అవసరమా?
- ఎన్ని రకాలుగా మనం మన శక్తిని వృధా చేస్తున్నాం? భవిష్యత్తులో మన శక్తిని, సమయాన్ని వృధా చేయకుండా ఉండటం ఎలా?
గమనిక
గురువు ఈ చర్చ అనంతరం పిల్లలకు సమయం, శబ్దం మరియు శక్తి యొక్క ప్రాముఖ్యత, మరియు వాటిని వినియోగించుకోవాల్సిన పద్ధతి గురించి సలహా ఇవ్వాలి.