చిత్ర రహస్యం
చిత్ర రహస్యం
లక్ష్యం:
పిల్లల ఊహాశక్తి నీ వ్యక్తీకరించడానికి రూపొందించబడింది. ఇందులో ఆటగాళ్ళు మరొక ఆటగాడు గీసిన చిత్రం చూసి ఆ చిత్రానికి సరిపడే పదం ఊహించాలి.
సంబంధిత విలువలు:
- ఊహ
- సృజనాత్మకత
- ఉత్సుకత
- విచారణ శక్తి
- విజువలైజేషన్
అవసరమైన వస్తువులు:
- వైట్ బోర్డ్ & పెన్నులు
- పేపర్ & పెన్సిల్స్
- పదాలు & స్లిప్‌ల జాబితా
గురువులు చేయవలసిన పనులు:
- గురువులు జాబితాను సిద్ధం చేస్తారు. జాబితాలో ఈ భాగాలు ఉంటాయి:
- ఆధ్యాత్మికభాగం: శ్రీకృష్ణుడు, విష్ణువు, శివుడు, సుబ్రమణ్యుడు, గణేష్, బుద్ధుడు, జీసస్, జొరాస్టర్.
- విశిష్ట వ్యక్తుల భాగం: గాంధీజీ, చాచా నెహ్రూ, కవి భారతీయార్, వివేకానంద, చత్రపతి శివాజీ, మీరాబాయి.
- విలువలు మరియు ఉపవిలువల భాగం: ఆనందం, ప్రేమ, భాగస్వామ్యం, సంరక్షణ, ఐక్యత, శాంతి, న్యాయం, స్నేహం, రక్షణ, శక్తి, దేశభక్తి, దృష్టి, నిశ్శబ్దం, పరిశుభ్రత, త్యాగం.
- ఇంద్రియ అవగాహనల భాగం:ధ్వని, స్పర్శ, రుచి, దృష్టి, వాసన
- సాయి వాక్య విభూతి భాగం:
- ప్రార్థన చేసే పెదవుల కంటే సేవ చేసే చేతులు పవిత్రమైనవి
- హీరోగా ఉండా లి సున్నాగా కాదు
- అందరినీ ప్రేమించండి, అందరికీ సేవ చేయండి
- తల అడవి లో చేతులు సమాజంలో
- నిశ్శబ్దం అంటే సాయి లెన్స్
- డబ్బు వస్తుంది పోతుంది కానీ నైతికత వచ్చి పెరుగుతుంది
- కాలం వ్యర్థం చేసిన, జీవితమే వ్యర్థ మగును.
- మంచి చూడండి
- స్థిరంగా ఉండటానికి చదువుకోండి
- జీవితం ఒక ఆట, ఆడండి
- తరువాత, గురువు జాబితా లో వున్న పదముల తో స్లిప్‌లను సిద్ధం చేస్తుంది.ఒక స్లిప్ పైన ఒక పదం వుంటుంది.
ఎలా ఆడాలి
- ఒక పిల్లవాడికి పదం వ్రాసిన స్లిప్ ఇవ్వబడుతుంది. (ఉదాహరణ: ప్రేమ).
- ఆ వాక్యాన్ని పైకి పలకకుండా ప్రేమను సూచించే చిత్రాని పిల్లవాడు బోర్డు పైన గీయాలి.
- గీసిన చిత్రం చూసి మిగిలిన పిల్లలు దానికి తగిన పదం ఊహించాలి.
- ఎటువంటి శబ్దా