కలసి ఆడుకోవడం
కలసి ఆడుకోవడం
ఉపాధ్యాయుడు ఇస్తున్న సూచనలను అనుసరించండి…. పారే నీటి సవ్వడి, ప్రకృతి ధ్వనులు,నీటిలో తిమింగలములు నీటిలో చేయు ధ్వనులు మరియు ఇంపైన సంగీతమును వినండి. |
(మీకు అవసరమైతే) వినటానికి మృదువైన నేపథ్య సంగీతాన్ని వినటానికి పెట్టండి.
సుఖాసనంలో కుర్చీలో కానీ లేదా నేల మీద స్థిరాసనంలో కూర్చోండి.
వెన్నెముకను,తలను నిటారుగా ఉంచండి.
మెల్లగా దీర్ఘ శ్వాసను తీసుకుని, తిరిగి మెల్లగా బయటకు వదలండి.
కళ్ళు మూసుకోండి.మీకు అలా అసౌకర్యంగా ఉంటే నేలవైపు చూడండి.
మళ్లీ దీర్ఘ శ్వాస తీసుకోండి.
మీరు సంగీతం వింటున్నప్పుడు… మీరు మీ స్నేహితుడి ఇంట్లో ఆడుకుంటున్నట్లుగా ఊహించుకోండి.
ఆడుకోవడం పూర్తయినచో ఆట వస్తువులను దాచి పెట్టమని నీ స్నేహితుడి తల్లి చెప్తుంది.
అప్పుడు నీవు స్నేహితుడికి సహాయం చేయదలుచుకున్నావు.
నీవు నీ స్నేహితుడితో కలిసి ఆనందంగా ఆట వస్తువులను సర్దుతున్నారు.
ఇలా చేయడం నీకు చాలా ఆనందంగా ఉంది.
కలిసి మెలిసి, ఒకరికొకరు సహకరించుకోవడం వలన పనులు ఎంత సులువుగా చేయవచ్చునో తెలుసుకోండి.
మీరు ఆ ఆనందాన్ని అనుభూతి చెందండి. ఇప్పుడు నేను చిన్నగా చేసే గంటల శబ్దంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి, మీ పక్క కూర్చున్న వారిని చూసి నవ్వండి.
[సత్య సాయి మానవతా విలువల విద్యా బోధన ఆధారంగా – చక్కని నడత మరియు భావోద్వేగ అక్షరాస్యత అభివృద్ధి కొరకు పాఠ్య ప్రణాళిక -కరోలే ఆల్డర్మాన్]