పోస్ట్ బాక్స్
పోస్ట్ బాక్స్
లక్ష్యము:
ఇది ప్రత్యేకమైన ఉత్సాహ పూరి తమైన ఆట
సంబంధిత విలువ:
వివిధ మతాలకు సంబంధించిన పరిజ్ఞానం.
అవసరమైన వస్తువులు:
వివిధ మతాల కార్డ్స్, 5 లేక 6 సబ్బు పెట్టెలు, చెక్క బల్ల
గురువు ముందస్తు తయారీ:
- వివిధ మతాల సమాచారం కార్డ్స్ లో తయారు చేయాలి, లేదా సేకరించాలి (ఉదా: మతం పేరు, వ్యవస్థాపకుడు, గ్రంధం, పండుగలు, పవిత ప్రదేశాలు, ఆరాధనా స్థలాలు మొదలైనవి).
- పోస్ట్ బాక్స్ ల లాగా ఒక బోర్డు కి అతికించాలి.
ఎలా ఆడాలి
- గురువు, పిల్లలను 2,3 గ్రూప్ లు గా విడగొట్టాలి.
- అన్ని కార్డ్స్ బాగా కలిపి ఒక బృందానికి ఇవ్వాలి.
- ఇచ్చిన కార్డ్స్ ని బట్టి 2,3 నిమిషాలు ఆలోచించడానికి సమయం ఇవ్వాలి.
- ఆ విద్యార్థులు కార్డ్స్ నిర్నీత సమయం లో సరిఅయిన బాక్స్ లలో పెట్టాలి.
- సమయం అయిపోయాక కరెక్ట్ గా పెట్టిన వాటికి మార్కులు వెయ్యాలి.
- ఇలా అన్ని గ్రూప్ లు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆడవచ్చు. ఎక్కువ మార్కులు వచ్చిన బృందాన్ని విజేతలుగా ప్రకటిస్తారు.
వివిధ పద్ధతులు:
- ఒక బాక్స్ ప్రశాంతి చిహ్నం – అన్ని మతాల కలయిక గా పెట్టవచ్చు.
- పిల్లలు పుట్టపర్తి లో జరిగే పండుగలు ఉన్న కార్డ్స్ పెట్టవచ్చు (ఈశ్వరాంబ దినోత్సవము, శివరాత్రి, ఆషాఢ ఏకాదశి మొదలైనవి)