సీతారాముల దివ్యకళ్యాణం
సీతారాముల దివ్యకళ్యాణం
జనకమహారాజుకు సీత అనే కుమార్తె ఉంది. సీత పసిదానిగా ఉన్నప్పుడు, ఒక రోజు, తన స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడు, తన బొమ్మ శివధనస్సు ఉంచిన పొడవైన పెట్టి క్రిందకు దొర్లుతూ వెళ్ళడం చూసింది. ప్రతి ఒక్కరూ దాన్ని చూసి ఆశ్చర్యపోయే విధంగా సీత నాజూకైన తన చేతితో ఆ పెట్టెను ప్రక్కకు నెట్టి ఆ బొమ్మను అందుకుంది. అందువల్ల, ఎవరైతే ఆ వింటిని ఎత్తి ఎక్కుపెడతారో అతడే వివాహంలో సీత పాణిగ్రహణం చేస్తాడని జనకుడు నిర్ణయించుకున్నాడు.
ఆ విల్లును తేగానే, జనకుడు సమావేశమైన వారినందరినీ వారి శక్తి మేరకు ప్రయత్నించి, ఆ విల్లును ఎక్కుపెట్టమని ఆహ్వానించేడు. విశ్వామిత్రుని ఆజ్ఞతో రాముడు తన ఎడమ చేతితో వింటితొడుగును తొలగించేడు. తన కుడిచేత్తో బాణాన్ని సంధించి వదలిపెట్టడానికి వెనుకకు లాగగానే పెద్ద శబ్దంతో విల్లు విరిగిపోయింది. జనకుడు విశ్వామిత్రుని దగ్గరకు వెళ్ళి, ఆయన పాదాలపై పడి రామునికి దివ్యశక్తి ఉన్నదని ఒప్పుకుని, తన కుమార్తె సీతను రామునికిచ్చి వివాహం చేసే ఏర్పాటుకు అంగీకరించమని ప్రార్థించేడు. దశరథునికి వెంటనే వర్తమానం చేసేరు. అతడు సంతోషంతో తన అంగీకారాన్ని తెలిపి తన పరివారంతో మిథిలకు తరలివచ్చేడు.
గురువులు బాలలకు బోధించవలసినవి:
జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మన తల్లిదండ్రులతో చర్చించాలి. వారి అనుమతి, ఆశీస్సులు తీసుకోవాలి.
గ్రహించి అలవరుచుకోవలసిన విలువలు: విధేయత, తల్లిదండ్రుల పై గౌరవం.
నలుగురు అన్నదమ్ముల వివాహాలు ఒకే సమయంలో జరిగేయి. రాముడు సీతను వివాహం చేసుకున్నాడు. లక్ష్మణుడు సీత సోదరి ఊర్మిళ, భరత, శత్రుఘ్నులు వరుసగా జనకుడు సోదరుని కుమార్తెలైన మాండవి, శ్రుతకీర్తిలను వివాహం చేసుకున్నారు. ప్రజలందరూ ఎంతో ఆనందించేరు.