మంచిని చూడు -మంచిని చేయి
మంచిని చూడు -మంచిని చేయి
ప్రస్తుత కాలంలో టీవీ, వార్తాపత్రికలు వంటి మాస్ మీడియా ద్వారా అవినీతి, హింస, ద్వేషం, మతపరమైన అల్లర్లు పెరిగిపోతున్నాయి. పిల్లలు అనుకరించడానికి తగిన రోల్ మోడల్స్ లేవు. మన చుట్టూ జరుగుతున్న మంచి సంఘటనలను చూసినప్పుడు మాత్రమే వారు మంచిని గ్రహించగలుగుతారు. వాటిని ఆచరిస్తే సురక్షితంగా ఉంటారు. మంచిగా ఉండటానికి మంచి పనులు చేయడానికి ప్రేరేపించబడతారు. వారు మంచి వార్తలు చూసినప్పుడు వాటిని చిత్రంతో సహా సేకరించి శుభవార్తలు కూడిన ఒక స్క్రాప్ పుస్తకాన్ని తయారు చేయాలి. ఆ సంఘటన నుండి గ్రహించవలసిన విలువలను కూడా ప్రస్తావించాలి.
ఉదా:
- దృష్టిలోపం ఉన్న అమ్మాయి ఇతరులకు మార్గాన్ని చూపుతుంది.(సంకల్పం, ఆత్మవిశ్వాసం)
- ఉన్నత పాఠశాల పిల్లలు 9471 కిలోల చెత్తను తొలగిస్తారు. (పరిశుభ్రత, ప్రకృతి పట్ల ప్రేమ)
- విదేశీ విద్యార్థులు మురికివాడల పిల్లలకు బోధిస్తారు. (కేరింగ్ & షేరింగ్)
- పడవ వాడు 300 మంది గ్రామస్తులను రక్షించాడు. (ప్రేమ, ధైర్యం).
- కండక్టర్ ప్రయాణికుల బ్యాగు తిరిగి ఇస్తాడు. (నిజాయితీ, కర్తవ్యం).