ఆత్మగౌరవం

Print Friendly, PDF & Email
ఆత్మగౌరవం

దశ 1 :

  1. సౌకర్యవంతమైన స్థితిలో కుర్చీ మీద కానీ, నేల మీద స్థిరాసనంలో కానీ కూర్చోండి.
  2. మీ వెన్నెముకను, తలను నిటారుగా ఉంచండి.
  3. మెల్లగా దీర్ఘశ్వాసను తీసుకుని, తిరిగి మెల్లగా బయటకు వదలండి.
  4. కొద్దిగా విశ్రాంతి తీసుకుని, దీర్ఘశ్వాసను మళ్లీ మళ్ళీ తీసుకోండి.

దశ 2 :

ఇప్పుడు మీ శ్వాసపై ఎఱుకను కలిగి ఉండండి. మీ ఊపిరితిత్తుల నిండా దీర్ఘ శ్వాసను తీసుకోండి. తగినంత సమయం తీసుకుని మెల్లగా బయటికి వదలండి. కళ్ళను నెమ్మదిగా మూయండి.

మీరు శ్వాసను లోపలికి తీసుకుంటున్నప్పుడు స్వచ్ఛమైన గుణనివారణ శక్తి (హీలింగ్ పవర్) మీ లోపలికి ప్రవేశించినట్లుగా ఊహించుకోండి. ఆ శక్తి మీలో ఆనందాన్ని, ప్రేమను, శాంతిని నింపుతున్నట్లుగా భావించండి. శ్వాసను బయటికి వదులుతున్నప్పుడు మీకు అసౌకర్యాన్ని కలిగించే గుణాలైన విచారము, అలసట, కోపము, చిరాకు, భయము, విసుగు, అసూయ వంటివి బయటికి వెళ్తున్నట్టుగా భావించండి. మీరు సంతోషంగా ఎటువంటి చింతలు లేకుండా ఉన్నట్టుగా ఊహించుకోండి. ఇలా మూడు నాలుగు పర్యాయములు చేసినచో, మిమ్మల్ని ఆందోళనపరచే విషయములు అన్ని ఒక్కొక్కటి దూరంగా వెళ్లిపోతాయి.

దశ 3 :

మీరు సంగీతాన్ని వింటున్నప్పుడు మీ ముందు అందమైన గ్రామీణ వాతావరణము కానీ లేదా ఉద్యానవనం కానీ వున్నట్లుగా భావించండి. చెట్లు మరియు పొదలతో కూడిన కంచెను చూడండి. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. తేలికపాటి వెచ్చని గాలి మిమ్మల్ని తాకుతోంది. మీరు ఈ విధమైన అనుభూతిన పొందినట్లయితే, మీరు అందమైన మార్గంలో షికారు చేయవచ్చు. ఆ మార్గం చాలా అందంగా ఉంది. మీరు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉన్నారు. ఆ మార్గంలో ఉన్న ప్రకాశవంతమైన పువ్వులను చూడండి. మీ చుట్టూ ప్రతీది అందంగా ఉంది. మీ అంతరంగం కూడా అందంగా ఉంది. మీరు చాలా ప్రేమ కలవారు, అందమైన వారు కూడా. మీ చుట్టూ ఉన్నవారు కూడా అదే విధంగా ఉన్నారు. వీటన్నింటినీ చూస్తూ మీరు చాలా సంతోషంగా, విశ్రాంతిగా ఉన్నారు.

దశ 4 :

ఇప్పుడు దృష్టిని తిరిగి తరగతి గదికి తీసుకుని రండి. వ్యాయామం పూర్తి అయినది కనుక మీ కళ్ళను తెరిచి విప్పార్చండి. మీ పక్కన ఉన్న వారిని చూసి నవ్వండి. కూర్చుని చేసే ఈ వ్యాయామం యొక్క అనుభవాలను విద్యార్థులు పక్కవారితో పంచుకోవాలని అనుకోవచ్చు కనుక వారిని ప్రోత్సహించండి.ఈ వ్యాయామం వలన వారు ఎటువంటి అనుభూతిని పొందారో అడగండి. ఆ అనుభూతిని చిత్రంగా గీయమని ప్రోత్సహించడం వల్ల పిల్లలలో సృజనాత్మకత పెంపొందుతుంది.

శ్రీ సత్యసాయి మానవతా విలువల బోధని ఆధారంగా.]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *