శివ శంభో – ఆక్టివిటీ
శివ శంభో – ఆక్టివిటీ
సమూహ కార్యాచరణ : సామూహిక కార్యక్రమము : శివుడి యొక్క వివిధ పేర్లు
లక్ష్యము: బృందము యొక్క పరస్పర సహకారం.
కావలసినవి: చార్ట్ – 1, శివుడి చిత్రము – 1, ఒక్కొక్క బృందమునకు ఒక మార్కర్ పెన్.
ఆడించు విధానము: ఏదైనా కేలండర్ నుండి కానీ లేదా పత్రిక నుండి కానీ శివుడి యొక్క ఒక చిత్రమును సేకరించుము.
పిల్లలను గ్రూపులుగా చేసి నాయకున్నొకరిని నియమించాలి. ఆ గ్రూప్ నాయకుడు చార్టులో శివుడి యొక్క చిత్ర పటమును అతికించిన తర్వాత వారికి ఇచ్చినటువంటి సమయంలో (5-15 ని.లు) మిగిలిన పిల్లలు శివుడికి గల వివిధ పేర్లను చెప్పునప్పుడు ఒకరు లేదా ఇద్దరు పిల్లలు వాటిని చార్ట్ లో వ్రాయాలి. ఏ గ్రూప్ ఎక్కువ పేర్లను వ్రాస్తే వారే విజేతలు.