సువాసన - గులాబీ పువ్వు - Sri Sathya Sai Balvikas

సువాసన – గులాబీ పువ్వు

Print Friendly, PDF & Email

సువాసన – గులాబీ పువ్వు

ప్రియమైన పిల్లలూ!

నిటారుగా కూర్చుని గట్టిగా శ్వాస తీసుకుని వదలండి. మెల్లగా కళ్ళు మూసుకోండి. రోజా పువ్వు మీద దృష్టి పెట్టండి. అది పిల్లలను ఎంతగానో ఇష్టపడే జవహర్లాల్ నెహ్రూకి చాలా ఇష్టమైన పువ్వు. గులాబీ చాలా అందంగా మంచి సువాసనతో ఉంటుంది. కానీ దానికి ముళ్ళు కూడా ఉంటాయి. మీరు గులాబీ వలే సువాసనను స్వచ్ఛమైన ప్రేమను కలిగి ఉన్నారు. గులాబీ కి గల ముళ్ల వలే మీరు కూడా తల్లితండ్రులు చెప్పే మాటలు వినకుండా చెడు మార్గాల లో కి వెళ్తారు.అట్లు అవిధేయత తో ప్రవర్తించుట మంచిది కాదు.

బాబా అంటారు,”తల్లిదండ్రులను గౌరవించండి వారే భగవంతుడు” అని.

గులాబీ తన ప్రత్యేకత ను నిలుపుకున్నట్లే, మీరు కూడా మంచితనానికి విలువలకు ప్రతీకగా నిలవాలి. బాబా తన పిల్లలందరినీ మంచిగా ఉండమని, మంచినే చూడమని మంచినే చెయ్యమని చెప్తారు. నెమ్మదిగా కళ్ళు తెరవండి.

ప్రశ్నలు:
  1. నీ రోజా పువ్వు రంగు ఏమి?
  2. గులాబీ లక్షణాలు ఏవి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: <b>Alert: </b>Content selection is disabled!!