గురుబ్రహ్మ శ్లోకము – చేయవలసినవి

Print Friendly, PDF & Email
గురుబ్రహ్మ శ్లోకము – చేయవలసినవి

ఉద్దేశము:- బ్రహ్మ, విష్ణు పరమేశ్వరులు ఆచరించే సృష్టి, స్థితి, లయలను మొదటి వర్గానికి చెందిన బాలవికాస్ విద్యార్థులు అర్థం చేసుకునేటట్లు ప్రయత్నించుట.

అవసరమైన సామాగ్రి:- మట్టి లేదా తగరపు పాత్ర, ఎరువు, రాగి, ఆవాలు మొదలైన గింజలు

పద్ధతి:-

  1. తరగతిలోని విద్యార్థులను ముగ్గురు లేక నలుగురు గల వర్గాలుగా విభజించండి.
  2. ప్రతి వర్గానికి ఒక మట్టి పాత్రను ఇచ్చి ఆ పాత్రపై వారికిచ్చిన గింజల పేరు వ్రాయమనండి.
  3. వారిని వారి పాత్రల ను ఎరువుతో నింపమనండి. ఆ ఎరువు పై నీళ్లు చల్లించండి.
  4. వారికిచ్చిన గింజల రంగు, పరిమాణము, ఆకారాలను గమనించమని చెప్పండి. ఆ గింజలు ఎలా మొలకెత్తి చిన్ని మొక్కలుగా ఎదుగుతాయో వివరించండి.
  5. వారికిచ్చిన గింజలను పాత్రలో నాటి, పైన నీళ్ళు చల్లమని చెప్పండి ఆ పాత్రలను కిటికీ వద్ద గానీ, ఎండ తగిలే చోట గాని ఉంచమని చెప్పండి.
  6. వంతులవారీగా పిల్లలను ఆ మట్టి పాత్రలను గమనిస్తూ తగినంత నీళ్లు చల్లమని హెచ్చరించండి.
  7. గింజలు మొక్కలు గా మారే విధానాన్ని వివరిస్తూ పాత్రలలోని కలుపుమొక్కలను తీసివేయమని చెప్పండి కొన్ని రోజులలో మొక్కలు మొలకెత్తటము పిల్లలు గమనిస్తారు.
  8. మొక్కలు పుట్టుట, పెరుగుట, కలుపు మొక్కలు ఏరివేయుట పై పిల్లల అభిప్రాయాలు ఒకరితో ఒకరు పంచుకొనమనండి.

Seed

Sand

Plant

సారాంశము:- ఇప్పుడు మీరు సృష్టి కారమగు బ్రహ్మ, స్థితికి విష్ణువు, లయకు ఈశ్వరుడు కారకులైనట్లు, గురువులు పిల్లల జ్ఞానం మొలకెత్తుటకు, పెరుగుటకు, అనవసరమైన లక్షణాలు త్రుంచుటకు ఎలా సహకరిస్తారో వివరించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *