ఆకాశం లేదా అంతరిక్షం

Print Friendly, PDF & Email
guided visualisation sky

ఆకాశం లేదా అంతరిక్షం

ప్రియమైన పిల్లలారా!,

కళ్ళు మూసుకొని అకాశాన్ని ఊహించుకోండి. మీరు ఎప్పుడైనా ఆకాశాన్ని అంత పెద్దదిగా, ఊహించారా! కానీ మీరు ఆకాశం కన్నా, విశాలవంతంగా ప్రకాశవంతంగా ఉన్నారు. మీరు దేవుని ఉనికిలో ముఖ్యమైన భాగం.

మీరు ఒక తోటలో నడుస్తున్నారు తోట చాలా అందంగా ఉంది. పక్షుల అరుపులు కిలకిల రావాలు, అవి సంతోషంగా ఎగురుతూ ఉన్నాయి. చల్లని గాలి వీస్తోంది. మీ శరీరానికి చల్లదనం తగులుతోంది.ఆకాశం వైపు చూడండి. ఎంత అందమైన ఆకాశం, అది కేవలం ఒక ఖాళీ స్థలం. దాన్నే స్పేస్ అంటారు. భగవంతునిచే సృష్టించబడింది. ఇది ‘ఓం’ అనే ప్రణవ ధ్వనితో ఎప్పుడూ ఉంటుంది.

మీరు అరవడం, మాట్లాడడం, పాడటం, ఏడవటం చేస్తారు. మరి ఆ శబ్దం ఎక్కడికి పోతుంది. అది శూన్యంలోకే వెళుతుంది. అంతరిక్షంలోకి వెళుతుంది. ధనవంతుడు, పేదవాడు, బలహీనుడు, బలవంతుడు అనే తేడా లేకుండా, ప్రతి ఒక్కరికి స్థలం అందిస్తుంది. వారి మాటను అంగీకరిస్తుంది. సకల జీవరాశిని,ఆకాశమే ఆహ్లాదపరుస్తుంది. సూర్యుడు తన కాంతి మరియు ప్రేమ కిరణాలతో ప్రకాశిస్తుంటాడు. మీరు కూడా మీ యొక్క రెండు చేతులు, హృదయాన్ని అందరి కోసం ఉపయోగించాలి. ప్రజలు, పక్షులు, జంతువులు, గ్రహాలు, చేపలు,రాళ్లకు సైతం ప్రేమ,సేవ,పంచండి. ప్రతిదానికి ఆకాశం స్థలం, వసతి కల్పిస్తోంది. అనగా, చోటు కల్పిస్తోంది.అలాగే మీ హృదయంలో కూడా, ప్రతి జీవికి చోటు ఇవ్వాలి. సంతోషకరమైన ఈ అనుభూతిలో కొద్దిసేపు నిశ్చలంగా ఉండండి. స్వామికి కృతజ్ఞతలు చెప్పండి. నెమ్మదిగా తిరిగి వచ్చి, ప్రశాంతంగా కళ్ళు తెరవండి.

తరగతి గదిలో చర్చ:

ప్రశ్నలు:
  1. పిల్లలు మీరు అంతరిక్షంలో ఏమేమి చూశారు?
  2. ఎవరు ఎవరి కోసం ఈ అంతరిక్షాన్ని స్పేస్ను సృష్టించారు?

[English Ref: ‘Silence to Sai-lens’- A Handbook for Children, Parents and Teachers by Chithra Narayan & Gayeetree Ramchurn Samboo MSK- A Institute of Sathya Sai Education- Mauritius Publications]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *