వృద్ధులతో సమయం గడుపుట
వృద్ధులతో సమయం గడుపుట
జీవితకాలం అంతా తన కుటుంబానికి దేశ భవిష్యత్తుకు ఉపయోగపడి వృద్ధాప్యంలో జీవితం గడుపుతున్న వారిని ప్రతి ఒక్కరూ తప్పక గౌరవించాలి. దురదృష్టవశాత్తు చాలామంది జీవితాలు వృద్ధాప్యంలో వృద్ధాశ్రమాలలో ముగుస్తాయి.
గ్రూప్ 3 విద్యార్థులు వారానికి ఒక గంట లేదా ఎక్కువ సమయం వృద్ధులతో గడపటం ద్వారా ఆ వృద్ధులకు జీవితం పట్ల నూతన ఉత్సాహం కలుగుతుంది. ఆశ్రమంలో ఉన్న వృద్ధుల వయస్సు, అభివృద్ధి వారి శారీరక, మానసిక స్థితిని బట్టి విద్యార్థి తన పాత అభిరుచిని పునరుద్ధరించడం, వారి కోసం పుస్తకాలు చదవడం, భజనలు పాడటం, ఆటలు ఆడటం, ఇంటర్నెట్ నేర్పించడం చేయవచ్చు లేదా వారి పంచుకునే వారి భావనలను వినటం ద్వారా వారిని ఆనందంగా, ఆరోగ్యంగా ఉంచవచ్చు. విద్యార్థులు తమ హృదయాలలో ఆనందం మరియు ఆశతో పాటు వారి ముఖాలపై చిరునవ్వులు తీసుకురావడం ద్వారా నిజంగా ఆశీర్వదించబడినట్లుగా భావిస్తారు. వారి పెద్దల పట్ల గౌరవాన్ని పెంచుకుంటారు. వారి అవసరాలు మరియు సమస్యలను అర్థం చేసుకుంటారు. వారి పట్ల శ్రద్ధ పెరుగుతుంది తమకున్న దానిని పంచుకోవడం నేర్చుకుంటారు.