రుచి -పంచదార
రుచి -పంచదార
(అందరు పిల్లలకీ కొంచెం పంచదార తినడానికి ఇవ్వండి)
ప్రియమైన పిల్లలూ!
ఇప్పుడు పంచదార తిన్నారు కదా! నెమ్మదిగా కళ్ళు మూసుకోండి.
మీ ముఖాలు చిరునవ్వుతో వెలగటం నేను చూస్తున్నాను. దానికి కారణం పంచదార. అది నాలుకకు తీయదనాన్నిస్తుంది.మీరు రసగుల్లా, గులాబ్ జామ్,కేకులను రుచి చూసే ఉంటారు కదా.. అవి ఏమిటి?
అవన్నీ తీపి పదార్ధములు. స్వామి తీపి పదార్ధాలు ఎన్ని రకాలో, కానీ పంచదార ఒకటే అంటారు.
మీరంతా వేర్వేరు కుటుంబాల నుండి వచ్చిన పిల్లలు.. పిల్లలు చాలా మంది.. కానీ ప్రేమ ఒక్కటే. అందరూ తీపి పదార్ధాలు, పంచదార లాంటి వారే. మంచి పిల్లలుగా ప్రవర్తించి, అందరినీ మీ లాగా మార్చాలి.
అలా మీరు ఎలా చేస్తారు? గౌరవ ప్రదంగా జీవించడం, శ్రద్ధ కలిగి ఉండుట,అందరికీ సహాయకారిగా ఉండుట, చక్కగా ప్రవర్తించుట ద్వారా.. మీ ప్రవర్తన చక్కగా ఉంటే మన సాయి మీతో సంతోషంగా ఉంటారు.
మీరంతా సాయి పిల్లలు. పంచదార వలె మధురమైన మీ సుగుణాలను అందరూ ఇష్టపడి ఆశీర్వదించేలా నడుచుకోండి.
మెల్లగా కళ్ళు తెరవండి.
ప్రశ్నలు:
- నీకు ఇష్టమైన తీపి పదార్థం ఏది?
- మనం పంచదార వలే ఎలా మధురంగా ఉండవచ్చు?