తామర పువ్వులు
తామర పువ్వులు
పిల్లలూ! అందరూ కళ్ళు మూసుకోండి.మీరు ఒక చెరువు దగ్గర నడుస్తున్నట్లు ఊహించండి. దగ్గరలో ఒక గుడి కూడా ఉన్నది. చెరువులో స్వచ్చమైన నీళ్లు, వాటిలో తామర పూలు ఉన్నాయి.అదే కలువ, కమలం, తామర పూలు, ఇవంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అవి గులాబీ రంగులో ఉన్నాయి. కమలం మన జాతీయ పుష్పం.
చాలా మెత్తగా మృదువుగా ఉంటుంది. మీ హృదయం కూడా తామర పువ్వులా మెత్తగా కోమలంగా ఉండాలి. సూర్యుడు ఉదయించగానే కలువలు రేకులు విప్పుతాయి. మనం కూడా దేవుని చూడగానే మన హృదయం అనే పుష్పాన్ని పూర్తిగా విప్పాలి. అలాగే తామర పువ్వు లాగా నిర్లిప్తత, స్వచ్ఛత కలిగి ఉండాలి. అదే మనకు కలువలు నేర్పే పాఠం. చెరువులో నీరు ఉన్నా అవి చక్కగా పూస్తాయి. వాటి కాండం బురదలో ఉన్నా దానికి ఏమీ అంటదు. అలాగే మనం కూడా ఎటువంటి వాతావరణంలో ఉన్నా వాటి చెడు ప్రభావం మనకి అంటకూడదు. కమలం ఆకుపై నీరు ఉంటుంది. కానీ ఆ నీరు దానికి అంటదు.
అందుకే తామరాకు మీద నీటి బొట్టు లాగా మనం కూడా అలాగే నిర్లిప్తంగా, నిష్కళ్మషంగా ఉండాలి. మనం మంచిగా ఉండాలి మన చుట్టూ ఉన్న అందరికీ ఆనందాన్ని సుగంధాన్ని పంచాలి.
సూర్యుడిని చూసినప్పుడు తామర పువ్వు విచ్చుకుంటుంది. దేవుడిని దర్శించగానే మన హృదయం కూడా అలాగే వికసించాలి.
కార్యాచరణ:
చెరువు కమలాలు వాటి చిత్రాన్ని గీయమని చెప్పాలి.
[Source: Early Steps to Self Discovery Step – 2, Institute of Sathya Sai Education (India), Dharmakshetra, Mumbai.]