చెట్లు
చెట్లు
పిల్లలూ! మీరు కళ్ళు మూసుకొని హూ హా అనండి. మూడు మార్లు అలాగే చెప్పండి. అప్పుడు మీకు విశ్రాంతిగా ఉంటుంది.
మీరు ఒక తోటలో ఉన్నామని ఊహించుకోండి. మీ చుట్టూ పూలు, సీతాకోకచిలుకలు ఉన్నాయి. అంతా పచ్చదనం. ఇప్పుడు తోటలో ఉన్న ఒక పెద్ద చెట్టు కింద కూర్చుందాం రండి. ఇప్పుడు మనం ఒక చెట్టు కింద కూర్చున్నాం కదా. చెట్టుని చూడండి. దాన్ని మొదలు (కాండం) చాలా బలంగా ఉంది. దాన్ని వేళ్ళు భూమిలో ఉన్నాయి. వాటి ద్వారానే చెట్టు నీటిని, ఖనిజాలను ఆహారంగా తీసుకుంటుంది.
కొమ్మల నిండా ఆకులు, పళ్ళు, పూలు ఉన్నాయి. చెట్టు మనకి ఎండలో నీడను ఇస్తుంది. దాని కొమ్మల్లో పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి. ఆనందంగా కిలకిలా రావాలు చేస్తాయి. గాలికి ఆకులు తలలు ఊపినట్లు ఊగుతాయి. బాగా పండిన పళ్ళు కింద రాలిపోతున్నాయి. వాటిని పక్షులు,ఉడతలు తింటున్నాయి. చెట్టు బలంగా పెద్దగా ఉన్నా, ఎత్తుగా ఉన్నాకూడా చాలా వినయంగా ఉంటుంది. మనం స్నేహితుల వలె చెట్టును కౌగిలించుకుందామా.
చెట్టు మనకి ప్రేమ అనే గుణాన్ని నేర్పుతుంది. మనకి కావలసిన కాగితం, పెన్సిళ్లు దానితోనే తయారవుతాయి. విద్యార్థిగా మనం చెట్లను రక్షించాలి. కాగితము, పెన్సిళ్లు ఎంత కావాలో అంతే వాడాలి. వృధా చేయవద్దు. నేను నా ప్రేమను చెట్లకు, అన్ని ప్రాణులకు, మొత్తం సృష్టికి పంచుతాను. ఇలా చెట్టును ఊహించుకోండి. మెల్లగా కళ్ళు తెరవండి.
చెట్టు పక్షులు జంతువులు తినటానికి పళ్ళు ఇస్తుంది. మనం కూడా ఏం ఆశించకుండా ఇతరులకు సేవ చేయాలి.
కార్యాచరణ:
ఊహించిన చెట్టు బొమ్మగా గీయండి.
[Source : Early Steps to Self Discovery Step – 2, Institute of Sathya Sai Education (India), Dharmakshetra, Mumbai.]