స్పర్శ – పట్టు వస్త్రము
స్పర్శ – పట్టు వస్త్రము
యీ వస్త్రాన్ని చూడండి. పట్టుకొని చూడండి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు మూసుకోండి.
ఆ పట్టు వస్త్రం బాగా మెత్తగా ఉన్నది. యీ వస్త్రం శరీరాన్ని కప్పుకోడానికి ఉపయోగిస్తాము. వస్త్రాన్ని పట్టుకుంటే చక్కగా మెత్తగా అనిపించింది. అలాగే ఇతరులు నిన్ను చూసినప్పుడు నీ వినయం, మృదు స్వభావము అనుభవించేలా ఉండాలి.
బాబా మధురంగా, నెమ్మదిగా మాట్లాడమన్నారు.
ఆ మెత్తని పట్టు వస్త్రం లాగా నీ ప్రవర్తన మధురంగా, గౌరవ ప్రదం గా ఉండాలి. భగవానుని ప్రేమను అందరికీ పంచండి. భగవానుని ప్రతినిధి గా మారండి. మీ మెత్తటి వస్త్రాన్ని ముట్టుకోండి. భగవంతుడికి తినడానికి తిండి, కట్టుకోడానికి బట్టలు, ఉండడానికి చోటు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలపండి. భగవంతుణ్ణి నమ్మండి. ఆయనే మనకు అన్నీ ఇచ్చేవాడు.
ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి.
ప్రశ్నలు:
- వివిధములైన వస్త్రాల పేర్లు తెలపండి?
- మనకు అన్నీ ఎవరిస్తారు?