త్వమేవ మాతా శ్లోకము – కృత్యము
త్వమేవ మాతా శ్లోకము – కృత్యము
కార్యాచరణ షీట్లు
బాలవికాస్ పిల్లలకు మాతృప్రేమ, పితృప్రేమ కు సంబంధించిన వీడియోలు చూపించాలి.
అదే విధంగా గురువులు పిల్లలకు జంతువులు వాటి సంతానము పట్ల కసబరిచే ప్రేమ మరియు తమ తోటి జంతువులు పట్ల చూపే ప్రేమకు సంబంధించిన వీడియోలు చూపించాలి.
ఉదా: ఏనుగు లేదా ఏదైనా పెద్ద జంతువు కుక్క లేదా చిన్న జంతువును రక్షించడం. కుక్క కోడి పిల్ల లేదా పక్షిపిల్లలను కాపాడటం మొదలైనవి.
వీడియోల ప్రదర్శన అనంతరం గురువులు పిల్లలను చర్చా పద్ధతిలో కొన్ని ప్రశ్నలు అడగాలి.
అనుకూలమైన ప్రశ్నలు:
- ఈ వీడియోలను చూసి మీరు ఆనందించారా? వీటిలో ఏ విషయం మిమ్మల్ని ఎక్కువ సంతోషపరచినది (నచ్చినది)? ఎందుకు?
- మనం ఇంటిలో మాత్రమే ప్రేమను పొందుచున్నామని మీరు భావిస్తున్నారా? పాఠశాలలో మనకు ఎవరు ప్రేమను పంచుతున్నారు? మన సంరక్షణ ఎవరు చూస్తున్నారు?
- మీకు ఆటలంటే ఇష్టమా? మనకు ఆటలపై ఆసక్తిని కలిగించేదెవరు?
- మీకు స్నేహితులున్నారా? వారితో ఉండటం మీకు ఆనందం కలిగిస్తుందా? ఎందుకు?
- మీకు రోడ్డు దాటడం అంటే భయమా? మీరు ఒంటరిగా ఎప్పుడైనా రోడ్డును దాటారా? మీరు ఒంటరిగా రోడ్డు దాటవలసి వచ్చినప్పుడు మీ ప్రక్కనున్న వ్యక్తి మీకు సహాయం చేసారా? మీరు ఎప్పుడైనా పక్కవారికి రోడ్డు దాటుటకు సహాయ పడ్డారా?
- మనం ఎల్లవేళలా మన తల్లితండ్రులు, సోదరులు, స్నేహితులతోనే ఉండడం సాధ్యమా?
- మీరు ఎప్పుడైనా అపరిచితుల పట్ల ప్రేమను చూపారా? ఏ విధంగా? అప్పుడు వారి అనుభూతి ఏ విధంగా ఉన్నది? వారు ఎలా భావించారు? మీకు ఆనందం కలిగినదా?
అనుమితి
గురువులు పిల్లలకు వివరించ వలసిన విషయం ఏమంటే – వారు తల్లితండ్రులు, గురువులు, స్నేహితులు, బంధువులు, సహచరులు, పెంపుడు జంతువులు మొదలగు వివిధ రూపాల ద్వారా పొందే ప్రేమ అంతా భగవంతుని ప్రేమయే అని. ఆ దైవ ప్రేమ ప్రతి ఒక్కరి నుండి మనకు ప్రసరిస్తూ ఉంది. అదే విధంగా మన ద్వారా ఇతరులకు పంచబడే లేదా అందించబడేది కూడా ఆ పరమాత్మ ప్రేమయే. భగవంతుడు తన ప్రేమను సర్వులపై సమానంగా ఏ భేదములేక పరిపూర్ణంగా కురిపిస్తాడు. ఆయన ప్రేమను కొన్నిసార్లు తల్లిగా, మరొకమారు స్నేహితునిగా మరొక పర్యాయం సోదరునిగా వర్షింప చేస్తాడు.
గురువులు చివరిగా ముగింపుకు ముందుగా పిల్లల్ని స్వామివారికి గ్రీటింగ్ కార్డ్ తయారు చేయమని చెప్పాలి.