కైకేయి రెండువరాలు

Print Friendly, PDF & Email
కైకేయి రెండువరాలు

Two Boons of Kaikeyi

అయోధ్యకు తిరిగి వచ్చిన తరువాత రాముడు, సీతా ఆనందంగా జీవిస్తున్నారు. రాముడు ప్రజా సంక్షేమాన్ని చూసుకునేవాడు, సంయమనాన్ని ఎప్పుడూ కోల్పోయేవాడు కాదు. అందరికీ సహాయం చేసేవాడు. దశరథుడు వృద్ధుడు అవుతున్న కారణంగా రామునికి రాజ్యాన్ని అప్పగించాలనుకుంటున్నానని వశిష్ఠునికి చెప్పి, రాముని పట్టాభిషేకానికి ఆజ్ఞాపించేడు.

ఈ సమయంలో భరత, శత్రుఘ్నులు అయోధ్యకు దూరంగా తమ మాతామహుల ఇంటికి చూడడానికి వెళ్ళేరు. రామపట్టాభిషేక వార్త వినగానే ముగ్గురు రాణులు ఎంతో ఆనందపడ్డారు. కైకేయి రాముని తన కన్న కొడుకులా ప్రేమించింది, కానీ ఆమె పరిచారిక మందర దుఃఖపడింది. ఆమె భరతుడు రాజు కావాలనుకుంది. అందువల్ల ఒక దుష్టప్రణాళిక తయారు చేసింది. రాముడు రాజుగా పట్టాభిషిక్తుడైతే, కౌసల్య అత్యంత శక్తివంతురాలై కైకేయిని తన బానిసగా చేసుకుంటుందని చెప్పి కైకేయి మనస్సును విషపూరితం చేయడానికి ప్రయత్నించింది. చివరికి ఆమె దుర్మార్గపు విధానాలకు కైకేయి బలైపోయింది. ఆమె మనస్సు సంశయాలతో నిండిపోయింది. మందర ప్రణాళికకు ఆమె అంగీకరించింది.

గురువులు బాలలకు బోధించవలసినవి:

కైకేయి స్వతహాగా మంచి స్వభావం కల స్త్రీ, కానీ తన పరిచారిక విధేయురాలు, జ్ఞాని అని భావంచడం చేత ఆమె విషపూరితమైన సలహాతో కైకేయి విషస్వభావి అయిపోయింది. అందుచేత మనం చేసే సహవాసం పట్ల మనం జాగరూకులమై ఉండాలి, మనమెప్పుడూ మన స్నేహితుల్ని గుడ్డిగా అనుసరించకూడదు. వారేం చెబితే దానికి అంగీకరించ కూడదు. వారు మన ప్రాణ స్నేహితులైనా వారిపై మనకెంత నమ్మకం ఉన్నా సరే.

మన విచక్షణా జ్ఞానాన్ని మనం తప్పక ఉపయోగించాలి. మనకీ, మన చుట్టు ప్రక్కల ఉన్నవారికీ ఏది మంచిదో నిర్ణయించాలి.

గ్రహించి అలవరుచుకోవలసిన విలువలు:
జీవితంలో ప్రాథమిక సూత్రాలేమిటంటే చెడు సహవాసాలకు దూరంగా ఉండు, ఎల్లప్పుడూ జగరూకుడివై ఉండు, నిర్ణయానికి ముందు విచక్షణని ప్రదర్శించు.

యుద్ధభూమి లో సహాయం చేసి అతని ప్రాణాలు రక్షించినందుకు తనకు ఇస్తానని దశరధుడు వాగ్దానం చేసిన రెండు వరాలను మందర కైకేయికి గుర్తు చేసింది. రాముని పట్టాభిషేకం గురించి చెప్పడానికి దశరథుడు కైకేయి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆమె విచారంగానూ, కోపంగానూ ఉంది. దశరధుడు అడిగినప్పుడు గతంలో తాను వాగ్దానం చేసిన రెండు వరాలనూ అడిగింది. మొదటి వరం భరతునికి రాజుగా పట్టాభిషేకం చేయాలని పట్టుపట్టింది. రెండవ వరం రాముడిని పదునాలుగు సంవత్సరాలు వనవాసానికి పంపాలి. ఇది వినగానే దశరధుడు దిగ్భ్రాంతుడై మూర్ఛపోయేడు. మరునాటి ఉదయం, రాముని పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లూ సిద్ధంగా ఉన్నాయని చెప్పడానికి వచ్చిన మంత్రి సుమంత్రుడు విచారంతో నేల మీద పడి ఉన్న దశరధుడిని చూసేడు. కైకేయి రాముడిని వెంటనే తీసుకురమ్మని సుమంత్రుడికి చెప్పింది. రాముడు వచ్చేడు. తన మనోవ్యధకు కారణం ఏమిటని తండ్రిని అడిగేడు, కాని సమాధానం లభించలేదు.

దశరథుడిని తానడిగిన రెండు వరాలగురించి రామునికి చెప్పింది కైకేయి. రాముడు వెంటనే చిరునవ్వుతో ఒప్పుకున్నాడు, తల్లిదండ్రుల ఆజ్ఞని శిరసా వహిస్తానని వాగ్దానం చేశేడు. అతడు కైకేయిని ఒకే ఒక అభ్యర్ధన చేసేడు. భరతుని పరిపాలన తండ్రిగారికి సంతోషం కలిగించేదిగా ఉండేలా చూడాలని.

గురువులు బాలలకు బోధించవలసినవి:

ఒకరి మాటను గౌరవించడం ఎలా ముఖ్యమైనది?
తండ్రి మాటను నిలబెట్టడానికి రాముడు అయోధ్య వెంటనే విడిచి పెట్టడానికి నిర్ణయించుకున్నాడు.

సమానత్వాన్ని రాముడు ఎలా చూపించేడు?
అతడు తన సమతౌల్యాన్ని కోల్పోలేదు. కైకేయి వరాల గురించి వినగానే కోపం తెచ్చుకోలేదు. మిగిలిన వారంతా తల్లడిల్లిపోయి ఉన్నప్పుడు అతడు శాంతంగా, నెమ్మదిగా ఉన్నాడు.

గురువులు బాలలకు బోధించవలసినవి:

You should always keep your promises; however you should always be careful when you make promises because once you give your word, you cannot go back on it.

మీరు మీ వాగ్దానాల్ని నిలబెట్టుకోవాలి. అయితే వాగ్దానం చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుచేతనంటే ఒక మారు మీరు వాగ్దానం చేస్తే వెనుకకు మరలకూడదు. ఉదాహరణకి పోటీలలో, ఆటలలో ఓటమి పాలైనప్పుడు తల్లడిల్లిపోయి, కోపం తెచ్చుకోకూడదు. అలా కాకుండా ప్రయత్నం చేసి మిమ్మల్ని మీరు మెరుగు పరుచుకోవాలి.

గ్రహించి అలవరుచుకోవలసిన విలువలు: వాగ్దానం విలువ, దుర్దశలో కూడా సమత్వాన్ని ప్రదర్శించడం.

అప్పుడతడు దశరధునికీ, కైకేయికీ సాష్టాంగ ప్రణామం చేసాడు. కౌసల్య దగ్గరకు వెళ్ళేడు. ఈ వార్తకు లక్ష్మణుడు క్రోధావేశుడయ్యేడు. కాని తండ్రికి విధేయునిగా ఉండటం తన ధర్మమని రాముడు లక్ష్మణునికి చెప్పేడు.

గురువులు బాలలకు బోధించవలసినవి:

రాముడు ఏ విధంగా విధేయుడైన కుమారుడు? తన తండ్రి గారి ఆజ్ఙను పాటించడమే కాకుండా, లక్ష్మణునికి ఆదర్శమూర్తి అయిన కుమారుడు ఎలా ప్రవర్తించాలో వివరించేడు.

గ్రహించి అలవరుచుకోవలసిన విలువలు:
“ఆచరించండి, బోధించండి”, “అయి ఉండండి, ఆచరించండి, అప్పుడే చెప్పండి”

కౌసల్య రామునితో అడవికి వెళ్ళాలని కోరుకుంది. కానీ, భర్త దశరథుని సేవించడం ఆమె ధర్మమని రాముడు చెప్పేడు. భరతుడు రాజుగా పట్టాభిషిక్తుడైనప్పుడు కూడా అదే సమానమైన ఆనందాన్ని నువ్వు అనుభవించాలని కౌసల్యకు చెప్పేడు. లక్ష్మణుడు రామునికి తోడుగా అడవికి వెళతానని కోరేడు. రాముడు అంగీకరించేడు, సీత కూడా అతనికి తోడుగా ఉంటానని కోరినప్పుడు, అడవిలో జీవితం కష్టంగా ఉంటుందని రాముడు వివరించేడు. అయినా అడవికి రాముని అనుసరించాలని సీత నిర్ణయించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *