ఉద్దరేదాత్మ – మరింత విపులంగా చదవుట కొరకు

Print Friendly, PDF & Email
ఉద్దరేదాత్మ – మరింత విపులంగా చదవుట కొరకు

ఒక వ్యక్తి తన స్వప్రయత్నంతో, తనని తాను ఉద్ధరించుకొనవలెను. తనని తాను అధోగతి చెందించుకోరాదు లేదా తనని తాను కించపరచుకోరాదు ‌ ఎందుకనగా తనకు తానే బంధువు. తనకు తానే శత్రువు అగును. తనంతట తాను స్వయంకృషితో ఉన్నత స్థితికి చేరుకోవాలి. అంతేకానీ దిగజార్చుకోరాదు. బుద్ధి ద్వారా జ్ఞానేంద్రియములను, మనస్సును నియంత్రించిన యెడల, ఆ జ్ఞానేంద్రియాలు మనకు మంచి స్నేహితులుగా ఉంటాయి. కానీ వీటిని అదుపులో ఉంచుకోకపోతే, అవే మనకు శత్రువులు అవుతాయి.

ఉదాహరణకు నాలుక:– నాలుకను వశం చేసుకున్నట్లయితే మంచిగా మాట్లాడటం, మంచి రుచులు ఆస్వాదించడం వంటి మంచి పనులు చేయవచ్చు. నాలుకకు ప్రేమగా, హితంగా మాట్లాడటం, భగ నామాన్ని స్మరించటం వంటివి శిక్షణ నివ్వాలి. ఉదాహరణకు నిరంతరం హరినామ స్మరణ వల్లే కదా ప్రహ్లాదుడు అన్ని కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని చివరకు భగవదనుగ్రహాన్ని పొందాడు.

మనం ఎటువంటి విత్తనాలు నాటుతామో, అటువంటి పంటను పొందుతాము. మనం చేసే ప్రతి మంచి పనికి, చెడ్డ పనికి ప్రతిఫలాన్ని పొందుతాము. మన వెంట మనం తెచ్చుకున్న కష్టాల నుండి బయటపటానికి మనమే పూర్తిగా బాధ్యత వహించాలి. మన బాధ్యతను మరొకరిపై వేయడం అవివేకం లేదా వ్యర్థం కూడా. జీవిత నాటకానికి ఇది నియమము. పరిమితి కూడా. ఫుట్బాల్ ఆటలో ఏ ఆటగాడైనా బంతితో ఎలా అయినా ఆడగలడు. ఫౌల్ లేదా అవుట్ మరియు ఆఫ్ సైడ్ లేదా గోల్, త్రో లేదా పెనాల్టీ ఇవి ఏమి ఇవ్వలేకపోతే “ఆ ఆట అర్థరహితమైనది మరియు ఆనంద రహితమైనది” అవుతుంది.

– S.S.S. II.

మన కర్మల ననుసరించి సుఖదుఃఖాలు కలుగుతాయి. ఈ సత్యాన్ని ఎవరైనా అంగీకరించిననూ లేదా తిరస్కరించిననూ, మన మాట, కర్మల ప్రభావం మనపై ప్రసరింపక తప్పదు. ఇది ప్రకృతి ధర్మము. కనుక మన కార్యకలాపాలను సరి అయిన మార్గంలో ప్రవేశ పెట్టడం ఉత్తమం. మీరు ఏది చేసినా, ఏది చూసినా, ఏది వినినా స్వచ్ఛంగా, త్రికరణ శుద్ధితో చేయాలి. దురాశ, ద్వేషం వంటి గుణాల పట్ల అప్రమత్తత వహించాలి. మనం కోరుకునే సుఖాలు చెడుతో కలుషితం కారాదు.

Vidya Vahini – p.88

మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండగలరా లేదా అన్నది మీ మానసిక పరిస్థితే నిర్ణయిస్తుంది. మీరు మానసిక ప్రశాంతతను అనుభవిస్తూ ఉన్నప్పుడు ఎవ్వరూ దానిని మీ నుండి దూరం చేయలేరు. మీ ఆనందాన్ని నాశనం చేసుకునేది మీరే. మీలో ద్వేషం, కోపం పెంపొందించుకున్నప్పుడు, మీ ఆనందాన్ని మీరే నాశనం చేసుకుంటారు. మీ మానసిక ప్రశాంతతను పూర్తిగా ప్రతికూలంగా చేసుకుంటారు. మీ కుటుంబంలోనే కాక, దేశంలోని సామరస్యాన్ని నాశనం చేస్తారు. దీనికి బదులుగా మీరు మంచి భావాలను, మంచి హృదయాన్ని కలిగి ఉండాలి. అందరితో సోదర భావాన్ని పెంపొందించుకోవాలి. ప్రేమ, కరుణ, మతసామరస్యాన్ని పెంపొందించుకున్నప్పుడే కుటుంబంలోనూ దేశంలోనూ సామరస్యాన్ని పెంపొందించుకొన గలరు.

వివరణ:

మనం చేసే ప్రతి ఆలోచన, మాట్లాడే మాట, చేసే పనికి పూర్తి బాధ్యత మనమే వహిస్తాము. దానిని మరొకరిపైకి మార్చటానికి ప్రయత్నించడం అవివేకము, వ్యర్థం కూడా. మనల్ని మనం సేవించుకుని, స్వాంతనపరిచుకునే సామర్థ్యం మనకు ఉంది. మనల్ని మనమే లోతుగా ఆత్మ పరిశీలన చేసుకోవచ్చు. మన మనసులో చెడు ఆలోచనలు, చెడు వైఖరి, ఆందోళనలు మరియు భయాలు ఉన్న యెడల చెడు పరిణామాలు ఎదుర్కొనవచ్చు. కనుక ఆత్మ పరిశీలన చేసుకుని ఎప్పటికప్పుడు మనల్ని మనం సంస్కరించుకోవాలి.
ఆత్మ పరిశీలన, స్వీయ విమర్శ కలిగి ఉండటం అన్నది ఆరోగ్యకరమైన ఎదుగుదలగా చెప్పవచ్చు. ఇది గురువు అనుగ్రహం వలన మనకు మనో ధైర్యాన్నిస్తుంది.

మన తప్పులను కప్పిపుచ్చుకోవటం, సాకులను వెతుక్కోవటం, తప్పు జరిగిన ప్రతిసారి ఇతరులపై నిందలు వేయడం మనకు హాని కలిగించుకోవటమే అవుతుంది. అప్పుడు మనకు మనమే శత్రువులమవుతాము.
ఇది మన ఆలోచనల ఫలితమే . మనము ఆత్మగౌరవాన్ని కోల్పోతే ఆత్మవిశ్వాసము లేదా ఆత్మసంతృప్తి ఉండదు. మ స్వీయ వ్యక్తిత్వానికి, మనకు మధ్యలో చాలా అగాధం ఉంది. చాలామందికి మన వ్యక్తిత్వంలో ఉన్న ద్వంద్వ వైఖరి గురించి అవగాహన లేదు. మనల్ని మనం తప్పుబడుతున్నాము. మన అసంపూర్ణతలను గుర్తించలేని స్థితిలో ఉంటున్నాము.

మేధోపరంగా మనకు నైతిక బలం, నిస్వార్థ ప్రేమ, క్రమశిక్షణతో కూడిన జీవితంపై స్పష్టమైన అవగాహన ఉంది. కానీ మన జీవితంలో అనుబంధాలు, ప్రేమ, ద్వేషాలు, మన అవసరాలు, కోరికలు తీర్చేందుకు అవసరమైన శక్తి మనకు లేదు. కనుక ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉంటూ, చెడు సాంగత్యాన్ని దూరంగా ఉంచటం అవసరం. బాబా చెప్పినట్టు అవాయిడ్ బాడ్ కంపెనీ, ఆల్వేస్ బి కేర్ఫుల్ అన్న మాటలను పాటించడం వల్ల మనము ఉన్నతమైన మరియు ఆదర్శమైన జీవనాన్ని పొందగలుగుతాము. చివరిగా, తనని తాను ఉద్ధరించుకోవడం, తనని తాను నశింప చేసుకోవటాన్ని ఆ వ్యక్తి స్వయంగా అంగీకరించాలి.

కథలు:
1.ప్రేమ నుండి ప్రేమ ఉదయిస్తుంది.

ఒకసారి అక్బర్ చక్రవర్తి, తన మంత్రి అయిన బీర్బల్ తో కలిసి నడిచి వెళ్తూ ఉండగా, దూరం నుండి ఒక రైతు రావడం చూశారు. అప్పుడు అక్బర్ బీర్బల్ తో “నేను ఆ వ్యక్తిని కాల్చాలని అనుకుంటున్నాను” అన్నాడు.. తర్వాత బీర్బల్ని అడిగాడు “మీరు ఆ రైతును కలిసినప్పుడు అతనికి మనసులో ఏమనుకుంటున్నాడో దయచేసి కనుక్కోండి” అని. రైతు దగ్గరికి వచ్చినప్పుడు బీర్బల్ ఆ రైతుకు అక్బర్ చక్రవర్తిని చూపిస్తూ, మీరు సంకోచించకుండా మీ మనసులో *”చక్రవర్తి గురించి మీరు ఏమి అనుకుంటున్నారో చెప్పండి” అని అడిగాడు.

అప్పుడు ఆ రైతు “నేను అతని గడ్డంలోని ప్రతి వెంట్రుకలను తీయాలనుకుంటున్నాను”అని చెప్పాడు.

బీర్బల్ రాజుతో ఈ విషయాన్ని చెప్పినప్పుడు అక్బర్ ఈ విధంగా చెప్పాడు”బీర్బల్! నా ఆస్థానానికి వచ్చే మహాపురుషులందరూ నాకు ఎప్పుడూ ఈ విధంగా చెప్తారు ”ఒక్క ప్రేమ ద్వారానే ప్రేమను గుర్తించి, తద్వారా భగవంతుని వద్దకు చేరుస్తుంది. ద్వేషము మాత్రము ప్రతిఫలంగా ద్వేషాన్నే ఇచ్చి, ఈ ప్రాపంచిక బంధనాలలో ముంచుతుంది” అని.

2.పేద వర్తకుడు మరియు మాయా రాయి.

ఒక గొప్ప సాధువు, వ్యాపారంలో నష్టాలలో మునిగిపోయి ఉన్న పేదవాడైనా ఒక వ్యాపారి ఇంటికి వెళ్లాడు. ఆ సాధు వెళ్ళినప్పుడు ఆ వ్యాపారి భగవంతుడిని “ఓ దేవుడా! దయచేసి నా యొక్క పేదరికాన్ని రూపుమాపండి” అంటూ ప్రార్థిస్తున్నాడు.

అది విన్న సాధువు దయతో ఒక మాయాజాల రాతిని అతనికి ఇచ్చాడు. ఈ రాతి ద్వారా లోహాలను బంగారంగా మార్చవచ్చు. కనుక ఈ రాయిని తీసుకుని కావలసినంత బంగారాన్ని పొందు. అయితే నేను నీకు మూడు నెలల సమయాన్ని మాత్రమే ఇస్తున్నాను. ఆ తర్వాత నేను తిరిగి వచ్చి దీనిని తీసుకుంటాను” అని చెప్పాడు.

మొదటి నెలలో వ్యాపారి మార్కెట్ కి వెళ్లి పాత ఇనుము ధర ఎంత? అని అడిగాడు. “ఇప్పుడే కిలో ఐదు రూపాయలు నుండి ఏడు రూపాయల వరకు పెరిగింది” అని వారు చెప్పారు. ఇనుము ధర పెరిగింది కదా. దీనిని ఇప్పుడు కొనడం తెలివి తక్కువ పని. వచ్చే నెల వరకు ఆగితే, దీని ధర తగ్గుతుంది అని అనుకున్నాడు. ఒక కిలో ఇనుము బంగారంగా మార్చినట్లయితే చాలా ధనవంతుడు అవుతాడని అతనికి అర్థం కాలేదు. ఒక నెల తర్వాత మళ్లీ మార్కెట్ కి వెళ్ళి విచారించగా ఈసారి ఇనుము ధర మరింతగా పెరిగింది.

“ఇంత డబ్బు వెచ్చించి ఈ ఇనుము కొనడానికి నేను తెలివి తక్కువ వాడిని కాను కదా. ఇంకొక నెలరోజులు ఆగి తే మంచిది కదా అని అనుకున్నాడు.

మూడవ నెలలో ధర మరింత పెరిగింది.. కిలో ఇనుము ధర 15 రూపాయలకు చేరినట్లుగా తెలుసుకున్నాడు. “ఇది చాలా ఎక్కువ ధర కదా. మరికొంత కాలం వేచి ఉంటే, ధర తగ్గడం ఖాయం”అని అనుకున్నాడు.

కానీ ఇంతలో మూడు నెలల వ్యవధి ముగిసింది. ఆ సాధు వచ్చి ఆ మాయారాయిని తిరిగి తీసుకున్నాడు. చివరికి ఆ వ్యాపారి మునపటి లాగానే పేదరికంలో ఉన్నాడు. సాధువుల సాంగత్యంలో, నిజమైన మూల లోహాలను స్వచ్ఛమైన బంగారంగా మార్చే నిజమైన తత్వవేత్త అనే రాయి కనుగొనబడింది.

ప్రశ్నలు:
  1. మనలోని ఉన్నతమైన ఆదర్శాలతో మనల్ని మనం ఎలా ఉద్ధరించు కొనవచ్చు?
  2. ABC దేనిని సూచిస్తుంది?
  3. తనకు తాను స్నేహితుడు, తనకి తాను శత్రువు ఎలా అవుతాడు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: