మనసు, మాట మరియు చేతల సమన్వయం

Print Friendly, PDF & Email
మనసు, మాట మరియు చేతల సమన్వయం
మనసు మాట చేతల సమన్వయం లోని నిజాయితీని తెలుసుకోవటం.

(పేరాగ్రాఫ్ లు మరియు పులిస్టాప్ ల మధ్య విరామం ఇవ్వండి)

దశ 1:

సౌకర్యం వంతమైన స్థితిలో కుర్చీ మీద కానీ లేదా నేల మీద స్థిరాసనంలో కూర్చోండి.

వెన్నెముకను, తలను నిటారుగా ఉంచండి. మెల్లగా దీర్ఘ శ్వాసను తీసుకుని, తిరిగి మెల్లగా బయటకు వదలండి. కొద్దిగా విశ్రాంతి తీసుకుని, దీర్ఘ శ్వాసను మళ్లీమళ్లీ తీసుకోండి.

దశ 2:

ఇప్పుడు శరీరంలోని ఉద్రిక్తతను తగ్గించండి. మీ కాలు వేళ్ళను సాగదీయండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి. పిక్క కండరాలను బిగించి, ఆపై వాటికి విశ్రాంతి ఇవ్వండి. ఆ తర్వాత మీ పైకాళ్లు మరియు తొడలలోని కండరాలను బిగించండి. ఆ తర్వాత వాటికి విశ్రాంతినివ్వండి. మీ కడుపు కండరాలను లాగండి. మళ్లీ వాటికి విశ్రాంతినివ్వండి. భుజాలను వెనక్కి లాగండి. మళ్లీ వాటికి విశ్రాంతినివ్వండి. మీ భుజాలను పైకి కిందికి తట్టండి. ఇప్పుడు మీ ఎడమ వైపు చూడండి. మళ్లీ ముందుకు చూడండి. తిరిగి కుడివైపు చూడండి. మళ్లీ ముందుకు చూడండి. ఇప్పుడు మీ ముఖం యొక్క కండరాలను బిగించండి. తిరిగి వాటికి విశ్రాంతినివ్వండి.మీ శరీరం మొత్తం విశ్రాంతి పొందినట్లుగా అనుభూతి పొందండి. అప్పుడు మీలోని ఉద్రిక్తతలన్నీ తగ్గిపోయి మీరు మంచి అనుభూతిని పొందుతారు.

దశ 3:

అది వేసవికాలం. మీరు ఒక అందమైన ఉద్యానవనంలో ఉన్నారు. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. మీరు కూడా సంతోషంగా ఉన్నారు. అప్పుడు ఒక బంతి గాలిలోనికి ఎగురుతూ మీ దగ్గరలో ఉన్న పొదలో పడింది. అది మీరు కిందటి వారం పోగొట్టుకున్న బంతి కాదు. అప్పుడు ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి “మీరు బంతిని చూశారా?” అని అడిగింది. అప్పుడు మీరు నిజం చెప్తారా? ఆ పొద వైపు చూపిస్తారా?

మీరు ఆ పొదవైపు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ బంతిని తీసి ఆమెకు ఇవ్వండి. ఆమె చాలా సంతోషం పడుతుంది. నిజం చెప్పినందుకు మీరు కూడా చాలా సంతోషంగా, తృప్తిగా ఉంటారు.

దశ 4:

ఇప్పుడు మీరు తిరిగి మీ దృష్టిని తరగతిగదిలోనికి తీసుకురండి. మీ కళ్ళని విప్పార్చండి. వ్యాయామం పూర్తి అయినది కనుక మీ ప్రక్కన ఉన్న వారిని చూచి నవ్వండి.

[శ్రీ సత్య సాయి మానవతా విలువల విద్యా బోధన ఆధారంగా]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *