పుట్టపర్తి – పుట్టవర్ధిని – స్వామి జననము

Print Friendly, PDF & Email
పుట్టపర్తి – పుట్టవర్ధిని – స్వామి జననము

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అవతరించిన/జన్మించిన “పుట్టపర్తి” పూర్వము “గొల్లపల్లి”గా పిలువబడుతుండేది. ఆ గొల్లపల్లె లో ఒక పాముల పుట్టలోని త్రాచుపాము ప్రతిరోజు ఒక ఆవుపొదుగు నుండి పాలు త్రాగుతుండేది. ఆవుకూడా ఎవరు చూడకుండా పుట్టదగ్గరికెళ్ళి రోజూ పాముకు పాలు ఇచ్చి తిరిగి వచ్చేది. ఇది చూసిన పశువుల కాపరి పట్టరానికోపంతో ఒక పెద్దరాయి తీసుకొని కొట్టి పామును చంపేశాడు. ఆ రాతి దెబ్బకు ఆ పాము రక్తసిక్తమై, గొల్లవంశములన్నీ క్షీణించిపోవాలనియు, ఆ గ్రామమంతా పుట్టలమయమై పోవాలని శపించి చనిపోయెను. ఆనాటి నుండి ఆ గ్రామము పుట్టలమయమై పోయింది.

ఏ రాయితో పామును కొట్టాడో ఆ పామురక్తచారలు గల ఆ రాతిని వేణుగోపాలస్వామిగా పూజలు చేయ మొదలు పెట్టారు ఆ గ్రామప్రజలు. ఆ తరువాత అక్కడ వేణుగోపాలస్వామి ఆలయం నిర్మించబడినది. ఈ గ్రామంలో రత్నాకర వంశం వారు పెద వెంకమరాజు మరియు ఈశ్వరమ్మ అను పుణ్య దంపతులు నివసిస్తుండేవారు. వీరి వంశంలోనే ‘వెంకావధూత’ అను అవధూత ‘భగవంతుని’ తన వంశంలో జన్మించమని ప్రార్థిస్తుండేవారు. ఈశ్వరాంబ పెద వెంకమరాజు దంపతులకు 1926 సం. నవంబరు 23వ తేదీ తెల్లవారుఝామున అక్షయనామ సంవత్సరం, కార్తీక బహుళతదియ, సోమవారం, ఆర్ద్రా నక్షత్రంలో పరమేశ్వరునికి ప్రీతికరమైన రోజున శ్రీ భగవాన్ సత్యసాయి బాబావారు జన్మించారు.

[Source : Lessons from the Divine Life of Young Sai, Sri Sathya Sai Balvikas Group I, Sri Sathya Sai Education in Human Values Trust, Compiled by: Smt. Roshan Fanibunda]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: